GHMC: గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దుల విస్తరణ
GHMC (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

GHMC: గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దుల విస్తరణ.. సీజీజీ ప్లానింగ్ తర్జనభర్జన

GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిని సమూలంగా విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లోపల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను (యూఎల్‌బీ) గ్రేటర్ హైదరాబాద్(Hyderabada) మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 25న జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఈ విలీన ప్రతిపాదనలను పంపడం ద్వారా, ప్రభుత్వం ఈ వ్యూహాత్మక చర్యను మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై జీహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంయుక్తంగా లోతైన కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జీహెచ్ఎంసీ(GHMC) పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10తో ముగుస్తుండటంతో, అంతకుముందే విలీనం, వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా, రానున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను పరిగణలోకి తీసుకుని ఈ భౌగోళిక మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

ప్రణాళికలో కీలక అంశాలు

ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీలోని 150 వార్డులను సుమారు 250 వార్డులుగా పునర్విభజించనున్నారు. విలీనం కానున్న 27 యూఎల్‌బీలలోని మొత్తం 622 చిన్న వార్డులను కలిపి ప్రత్యేకంగా మరో 50 వార్డులుగా విభజించాలని ప్రతిపాదించారు. అంతిమంగా జీహెచ్ఎంసీలోని మొత్తం వార్డుల సంఖ్యను 300 వరకు పరిమితం చేయాలని సర్కారు సూచించినట్లు అనధికారిక సమాచారం. 27 అర్బన్ లోకల్ బాడీల విలీనం తర్వాత జీహెచ్ఎంసీ భౌగోళిక స్వరూపం, జనాభా లెక్కలు భారీగా పెరగనున్నాయి. విస్తీర్ణం 650 చ.కి.మీ. నుంచి 1598.16 చ.కి.మీ.కు పెరుగుతుండగా, జనాభా సుమారు కోటి 41 లక్షల 27 వేల 858కి పెరిగే అవకాశముంది. ఈ విలీనంలో 20 మున్సిపాలిటీలు (407 వార్డులు), 7 మున్సిపల్ కార్పొరేషన్లు (215 వార్డులు) జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. పునర్విభజనలో భాగంగా ప్రతి 40వేల మంది జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ లెక్కన 300 పై చిలుకు వార్డులు ఏర్పడే అవకాశం ఉన్నా, ఆ సంఖ్యను 300 వరకే పరిమితం చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఔటర్ వరకు విస్తరించనున్న ఈ భారీ కార్పొరేషన్‌ను ఒకటిగా (300 వార్డులతో) కొంతకాలం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్​ కేసులో బిగ్ అప్డేట్.. వెలుగులోకి కీలక అంశాలు

పునర్విభజనలో రాజకీయ కోణం కీలకం!

జీహెచ్ఎంసీలో జరగనున్న ఈ వార్డుల పునర్విభజనలో రాజకీయ కోణమే ప్రధానంగా ఉంటుందన్న చర్చ బలంగా సాగుతోంది. గతంలోనూ డివిజన్ల స్వరూపంలో రాజకీయ లబ్ది కోసం మార్పులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈసారి కూడా, నగరంలో పెద్దగా బలం లేని అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు ప్రతికూలంగా ఉండేలా ఈ పునర్విభజన ప్రక్రియలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Also Read: Shalibanda Fire Accident: ఓల్డ్ సిటీ బ్లాస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. షాపు మూడు వైపులా విస్ఫోటనం.. ఉగ్రవాదుల పనేనా?

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!