MLA Krishnamohan Reddy: కేవలం అభివృద్ధి కోసమే సీఎంను కలిసా
MLA Krishnamohan Reddy (imagecredit:twitter)
Telangana News

MLA Krishnamohan Reddy: కేవలం అభివృద్ధి కోసమే సీఎంను కలిసాను: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

MLA Krishnamohan Reddy: తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్(Speaker Prasad Kumar) తీసుకున్న నిర్ణయాన్ని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Bandla Krishnamohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నాయకుల ఫిరాయింపుల ఫిర్యాదులపై విచారణ జరిపిన స్పీకర్ తనతోపాటు ఇతర ఎమ్మెల్యేలకు ‘క్లీన్ చిట్’ ఇవ్వడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని ఇందులో రాజకీయాలకు తావు లేదన్నారు.తాను పార్టీ మారలేదని, పలు అభివృద్ధి పనుల మంజూరు కోసం మంత్రులను కలిశానని ఆయన స్పష్టం చేశారు. గద్వాలను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు తాను శాయశక్తుల కృషి చేస్తున్నానన్నారు.

Also Read: IND vs SA 4th T20I: లక్నోలో నాల్గో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్.. దక్షిణాఫ్రికాకు అసలైన పరీక్ష!

క్లీన్ చిట్ పట్ల హర్షం

స్పీకర్ అసెంబ్లీలో సభ్యులమైన మేము చేసే వ్యవహారాలను నిరంతరం పరిశీలిస్తుంటారు. ఆ మేరకు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు. మేం పార్టీ మారలేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. సీఎంగా కేసీఆర్(KCR) ఉన్నప్పుడు పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వారిని నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయమై కలిసిన సందర్భాలు ఉన్నాయి. కావాలని ఇలా రాజకీయ దురుద్దేశంతో సుప్రీంకోర్టులో వేసిన కేసును స్పీకర్ తుది నిర్ణయానికి ఇచ్చారన్నారు. స్పీకర్ అన్ని కోణాలలో పరిశీలించి, నిర్ణయాన్ని వెలువరించారన్నారు. కావాలనే తన కొందరు బిఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులకు వెళ్లి లేని వివాదాలను సృష్టించడం బాధాకరమన్నారు. జడ్జిమెంట్ కాపీ పూర్తిగా అందిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని, తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారని, గతంలో తామిద్దరం జడ్పీటీసీ(ZPTC)లుగా కలిసి పనిచేశామని, ఆ సాన్నిహిత్యంతోనే గద్వాల అభివృద్ధి కోసం కలిశానని పేర్కొన్నారు.

Also Read: Sreeleela: స్నానం చేస్తున్నట్లుగా ఏఐ పిక్స్ వైరల్.. శ్రీలీల సంచలన పోస్ట్!

Just In

01

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

Purushaha: కన్నీళ్లతో చంపేస్తా.. పవన్ కళ్యాణ్ ‘పురుష:’ నుంచి హీరోయిన్ లుక్ విడుదల

Shocking Crime: అమెరికాలో తండ్రిని చంపిన భారత సంతతి యువకుడు.. ఇదే అసలైన ట్విస్ట్!

Harish Rao: రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు అభివృద్ధి బంద్!: హరీష్ రావు

Jogipet News: మంజీరకు ఇరువైపులా ఫిఫ్త్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మించాలని.. కేంద్ర మంత్రులకు వినతి..!