M Padmanabha Reddy: రెండేళ్లుగా గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిర్వీర్యం అయ్యే పరిస్థితి నెలకుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి(M Padmanaba Reddy) అన్నారు. మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని 243-కే ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు, గ్రామపంచాయితీ ఎన్నికలు జరపడానికి విస్తృతమైన అధికారాలు ఇచ్చారన్నారు. ఓటరు లిస్టు తయారీ, ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కట్టెట్టారన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా, న్యాయవ్యవస్థ కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఎన్నికల విషయమై సూపరింటెండెన్స్, డైరెక్షన్, కంట్రోలు అధికారాలు ఇచ్చారన్నారు. ఎన్నికల సంఘం తన బాధ్యతలను నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు.
పౌరసేవలపై ప్రభావం..
అయితే గత రెండేళ్లగా గ్రామపంచాయతీలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ఎన్నికల సంఘం(Election Commission) తన బాధ్యతలను నిర్వర్తించలేకపోతుందన్న భావన కలుగుతుందన్నారు. గ్రామపంచాయితీలలో ఎన్నికలు జరుగకపోవడంతో పంచాయితీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రప్రభుత్వం సైతం నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పౌరసేవలపై ప్రభావం పడుతుందని తెలిపారు. గ్రామపంచాయతీలకు 42% రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు ముడిపెట్టడంతో సమస్య మొదలైందని, 42% రిజర్వేషన్‌లపై హైకోర్టు(Hih Cort), సుప్రీమ్‌కోర్(Supreme Cort)టు రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ కు ప్రస్థుతం ఉన్న రిజర్వేషన్‌లతో కమీషన్ వారు ఎన్నికలు జరుపుకోవచ్చని స్పష్టంగా చెప్పిందన్నారు. అయినప్పటికీ ఎన్నికల కమీషన్ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వ అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయన్నారు.
Also Read: Maoist Surrender: తెలంగాణ ప్రాంత మావోయిస్టుల భారీ లొంగుబాటు!.. ఎప్పుడంటే?
రిజర్వేషన్‌ల సమస్య అడ్డంకిగా..
కమీషన్ రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను బాధ్యతలను మరిచి ప్రభుత్వ అనుమతి కోరడం సరైన పద్దతి కాదన్నారు. రాష్ట్ర హైకోర్టు గ్రామ పంచాయతీలకు ఈ నెల చివరి నాటికి ఎన్నికలు పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చిందని, అయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగం కల్పించిన అధికారాలు వినియోగించుకోకుండా ప్రభుత్వంలో ఒక శాఖగా పనిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను స్వాతిస్తున్నామని, అయితే పంచాయితీ ఎన్నికలకు 42% రిజర్వేషన్ ల సమస్య అడ్డంకిగా మారిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ. 9 న్యాయ పరీక్షకు నిలువడంలేదన్నారు. రిజర్వేషన్‌ల జగడం ఇప్పట్లో తేలేటట్లు లేదన్నారు. అంతవరకు ఎన్నికలు జరుపకపోవడం అంటే పంచాయితీలను నిర్వీర్యం చేసినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు చెప్పినట్లు ఇప్పుడున్న రిజర్వేషన్‌ల ఆధారంగా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
Also Read: Virat Kohli: ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు ఆసక్తికర పరిణామం.. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు
