Telangana Panchayats: పంచాయతీలో పేరుకుపోయిన సమస్యలు
Telangana Panchayats (imagecredit:twitter)
Telangana News

Telangana Panchayats: గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన సమస్యలు.. భారంగా పల్లె పనులు

Telangana Panchayats: నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఒకవైపు పాలకవర్గాలు.. మరోవైపు నిధులు లేక.. రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు కొత్త పాలకవర్గాలకు సమస్యలు సవాల్ విసురుతున్నాయి. మెజార్టీ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు వంటి అభివృద్ధి పనులకు నోచుకోకపోవడంతో పాటు పల్లె ప్రకృతి వనాలు. డంపింగ్ యార్డుల నిర్వహణ, గ్రామ పంచాయతీలో కార్యాలయాలకు వీధి దీపాల బిల్లులు పేరుకుపోయాయి. వీటికి తోడు గ్రామంలో సరఫరా మోటార్ల సైతం తరచూ రిపేర్లు వస్తున్నాయి దీనికి తోడు చెత్తను తరలించే ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు ఆర్ధికంగా పెనుభారంగా మారాయి. పాలకవర్గాలు పంచాయతీలను ఎలా ప్రగతి పథంలో తీసుకెళ్తాయనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.

రెండేళ్ల తర్వాత గ్రామ పంచాయతీ పాలకవర్గాలు కొలువు

రెండేళ్ల తర్వాత గ్రామ పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరబోతున్నాయి. 2019లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా పాలకమండళ్ల పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతూ వచ్చాయి. పాలక వర్గాలు లేకపోవడంతో 15వ ఆర్ధిక సంఘం నుంచి పంచాయతీలకు 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రాష్ట్రంలోని 12,723 గ్రామ పంచాయతీలకు రూ.6000 కోట్లకు పైగా నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకు బకాయి పడ్డాయి. దీనికి తోడు పాలకవర్గాలు లేకపోవడం మేజర్ పంచాయతీల్లో ఆస్తిపన్నులు కూడా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. తండాలు, ఇతర చిన్న పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కార్యదర్శులు చిన్నచిన్న అవసరాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఇప్పటికే మెజార్టీ గ్రామ పంచాయతీల్లో పని చేయడం లేదు. డీజిల్ సహా చిన్నచిన్న రిపేర్లు చేయించేందుకు సైతం నిధులు లేకపోవడం తో మూలన పడ్డాయి. షెడ్డుకు చేరిన ట్రాక్టర్లు మళ్లీ వీధుల్లో పరుగులు తీయాలన్నా.. పేరుకపోయిన చెత్తను ఎత్తిపోయాలన్నా వేళల్లో ఖర్చు చేయాల్సివస్తుంది.

Also Read: Niranjan Reddy: గ్రామ పంచాయతీ ఫలితాలు చూస్తుంటే.. మా సత్తా ఏంటో తెలుస్తుంది..?

ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు

దీనికి తోడు గ్రామాల్లో మరో సమస్య కూడా తీవ్రంగా వెంటాడుతుంది. కుక్కలు, కోతులతో చాలా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వారు కోతులను తరిమే వేస్తామని హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిని సైతం ఇతర ప్రాంతాలకు తరలించాలంటే వేళల్లో ఖర్చవుతుంది. కొన్ని గ్రామాల పాలకవర్గాలకు ఇది సవాలుగా మారనుంది. వీడికి తోడు పల్లె ప్రగతి, ప్రకృతి వనాలు నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రకృతి వనాలు పర్యవేక్షణ కొరవడింది. 15వ ఆర్థిక సంఘం నిధులపైనే పంచాయతీ పాలకవర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ నెల 22న నూతన సర్పంచ్‌లు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, ఈ పాలకవర్గాలన్నీ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఆ నిధులు మంజూరు అయితే తప్ప గ్రామాల్లో ప్రగతి పరుగులు పెట్టే అవకాశం ఉంది. లేకుంటే కొత్త పాలకవర్గాలకు ప్రజల నుంచి ఒత్తిడి తప్పదు. అయితే, సమస్యలన్నింటినీ ఎదుర్కొని ఎలా ముందుకు పాలకవర్గాలు వెళ్తాయనేది ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి.

Also Read: Fake Eye Doctors: మిర్యాలగూడలో ఫేక్ కంటి డాక్టర్ల గుట్టురట్టు కలకలం.. పరారీలో ఓ ఆర్ఎంపీ.. !

Just In

01

Jupally Krishna Rao: మోడీ, అమిత్ షా నియంతృత్వ పాలనను తరిమికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

Bigg Boss Grand Finale: ఈసారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మాములుగా ఉండదు.. ప్రోమో వచ్చేసింది!

KCR BRS LP: రాబోయేది మనమే.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. సాయంత్రం 6 గంటలకు ప్రెస్‌మీట్

MBBS Students: ప్రైవేట్ కాలేజీల దోపిడీకి చెక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

Brahmani Birthday: హీరో నిఖిల్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన నారా బ్రాహ్మణి