Ponguleti Srinivasa: మంత్రి పొంగులేటి నివాసంలో సంక్రాంతి శోభ
Minister-Ponguleti Srinivas Reddy (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Ponguleti Srinivasa: మంత్రి పొంగులేటి నివాసంలో సంక్రాంతి శోభ.. ఘుమఘుమలాడిస్తున్న వంటకాలు

Ponguleti Srinivasa: పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!

స్వరాజ్యమ్మ, శ్యామలమ్మల పర్యవేక్షణలో పసందైన వంటకాలు!

ఖమ్మం, బ్యూరో స్వేచ్ఛ: అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసం. సంక్రాంతి పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు. తోటి మనుషుల నోరు తీపి చేయడమే అసలైన పండుగ అని చాటుతున్నారు ఆయన సతీమణి మాధురి. తమను నమ్ముకున్న వారికి ప్రతిఏటా రుచికరమైన పిండివంటలు అందించే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు.

అమ్మ… అత్తమ్మల పర్యవేక్షణలో

మంత్రి పొంగులేటి నివాసంలో ఈసారి పిండివంటల తయారీలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. తన అత్తమ్మ స్వరాజ్యమ్మ, అమ్మ శ్యామలమ్మల పర్యవేక్షణలో మాధురి ఈ వంటలను సిద్ధం చేయిస్తున్నారు. కుటుంబంలోని ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో పాతకాలపు రుచులు ఉట్టిపడేలా వంటశాల సందడిగా మారింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరీ చేయిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లోని పెద్దల మార్గనిర్దేశంలో ఈ వంటకాలు చేయించడం విశేషం.

Read Also- Khammam News: నా భర్తకు అక్రమ సంబంధం ఉంది.. ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించిన ఖమ్మం మహిళ

ఘుమఘుమలాడే పసందైన రుచులు

ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రస్తుతం ఓ పెద్ద వంటిల్లులా మారిపోయింది. నేతి అరిసెలు, ఫ్లవర్ బాదుషాలు, మిక్చర్, నెలవంకలు వంటి నోరూరించే రుచులు అక్కడ సిద్ధం చేస్తున్నారు. ‘‘మా కోసం నిరంతరం శ్రమించే సిబ్బంది కూడా మా కుటుంబ సభ్యులే’’ అని ఈ సందర్భంగా మాధురి చెప్పారు. బయట కొన్న స్వీట్ల కంటే తమ చేతులతో చేసి పెట్టే వంటకాల్లోనే నిజమైన ప్రేమ ఉంటుందని ఆమె నమ్ముతున్నారు.

Read Also- Harish Rao: యూనివర్సిటీలపై ఎందుకంత కక్ష? కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం : హరీశ్ రావు కామెంట్స్!

ఏడాది పొడవునా అనురాగం

మంత్రి పొంగులేటి కుటుంబానికి పదిమందితో ప్రేమను పంచుకోవడం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అని స్థానికంగా చెప్పుకుంటుంటారు. వేసవిలో ఆవకాయ పచ్చడి, ప్రతీ సంక్రాంతి పండుగ వేళ పిండివంటలు పంపడం ఆ కుటుంబానికి ఒక ఆచారంగా కొనసాగుతోంది. ఎన్ని పనులున్నా, తమను నమ్ముకున్న మనుషులను గౌరవించే ఈ సంస్కృతి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరి హృదయాలను హత్తుకుంటోంది.

Just In

01

AP Telangana Water Dispute: మేం వివాదాలు కోరుకోం.. పక్క రాష్ట్రం అడ్డుపడొద్దు.. నీటి వివాదంపై సీఎం రియాక్షన్

V2V Technology: వాహనాల్లో ఇకపై కొత్త టెక్నాలజీ.. యాక్సిడెంట్ల నివారణలో అద్బుతం

Huzurabad News: హుజూరాబాద్ కేంద్రంగా ‘పీవీ జిల్లా’ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఏఐసీసీ, పీసీసీ చీఫ్‌కు వినతి పత్రం అందజేత..!

Minister Ponguleti: ఇల్లెందు మున్సిపాలిటీలో రూ. 3.17 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన: మంత్రి పొంగులేటి

DCM Pawan Kalyan: ‘సినిమా ఫ్లాప్ అయినా.. డబ్బు వచ్చే స్టార్ డమ్ నాది’.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు