Minister Konda Surekha (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Minister Konda Surekha: 22 నెలల్లో దేవాదాయశాఖ కు 6 డైరెక్టర్లుగా నియామకం అయ్యారు. దీనికి తోడు పూర్తి స్థాయి డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టకపోవడంతో శాఖ ఫైల్ లో జాప్యం జరుగుతుందనే కథనంను శనివారం ‘స్వేచ్ఛ’ ప్రచురించింది. ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పందించారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత 6 డైరెక్టర్లు మారడంతో దేవాదాయ శాఖ(Endowment Department) ఫైల్స్ పెండింగ్ లో పడుతున్నాయని, నియామకం అయినవారు సైతం అదనపు బాధ్యతల్లో నియామకం కావడంతో అభివృద్ధి పనులు సైతం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని శనివారం దేవాదాయశాఖ అధికారులతో కార్తీక దీపోత్సవంపై నిర్వహించిన సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది.

పూర్తి స్థాయి డైరెక్టర్ ఉంటే శాఖకు సంబంధించిన పైల్స్ ముందుకు సాగడంతో పాటు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆలయాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. భక్తులకు ఇబ్బందులకు లేకుండా ఉంటుంది. పూర్తిస్థాయి డైరెక్టర్ గా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని సైతం కోరనున్నట్లు మంత్రి పేర్కొన్నట్లు సమాచారం.

Also Read: Upasana Konidela: మెగా ఫ్యామిలీలో డబుల్ దీపావళి.. మరో వారసుడు వచ్చేస్తున్నాడోచ్.. ఫ్యాన్స్‌కు పండగే!

మంత్రిని కలిసి డైరెక్టర్ హరీష్..

తెలంగాణ ఎండోమెంటు డైరెక్టర్​​ గా హరీష్(Harish)​ బాధ్యతలు స్వీకరించిన(అడిషనల్​ చార్జీ) తర్వాత రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Sureka)ను శనివారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సురేఖ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Karimnagar: నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపుల దందా.. ఫార్మసిస్ట్ లేకుండా జోరుగా మందుల విక్రయాలు!

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?