Panchayat Elections: కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలంలోని కార్మిక ప్రాంత గ్రామపంచాయతీ 4ఇంక్లైన్ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న విద్యావంతురాలు పొడుగు భార్గవి బీజేపీ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పొడుగు భార్గవి ఇంటింటికి తిరిగి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. భార్గవి తోపాటు బిజెపి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు మహిళలు వృద్ధులు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనడం విశేషంగా మారింది. ప్రధానంగా వినూత్న రీతిలో భార్గవి ఎన్నికల హామీ పత్రం ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. విద్యావంతురాలైన భార్గవి ప్రచారానికి ఓటర్లు ఆకర్షితులవుతున్నారు.
Also Read: Panchayat Elections: పల్లెల్లో మూగబోయిన మైకులు.. ముగిసిన తొలి విడత ప్రచారం
ఆడపిల్ల పెళ్లి జరిగితే 5116లు చీర కానుక
పొడుగు భార్గవి తాను సర్పంచిగా ఎన్నికైయితే తన సొంత ఖర్చులతో గ్రామపంచాయతీ పరిధిలో ఆడపిల్ల పెళ్లి జరిగితే 5116లు చీర కానుకగా ఇస్తానని గ్రామ పంచాయతీ పరిధిలోని ఎవరి కుటుంబంలోనైనా ఆడపిల్ల పుడితే 5116లు పోస్ట్ ఆఫీస్ నందు ఫిక్స్ చేస్తానని ఆడపిల్లలు ఆడవారి భద్రతే లక్ష్యంగా గ్రామపంచాయతీ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి కుటుంబానికి దశలవారిగా రెండు లక్షల ఉచిత బీమా పథకం నిరుద్యోగులకు అందేలా చూస్తానని హామీ పత్రం ద్వారా అభ్యర్థిస్తున్నారు.
విద్యావంతురాలు అయిన భార్గవి గ్రామంలోని మహిళలు ఆడపిల్లల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తుండడం విశేషం. గ్రామపంచాయతీ అభివృద్ధికి రోడ్లు డ్రైన్లు మినరల్ వాటర్ ప్లాంట్ గ్రంథాలయం ఏర్పాటు స్ట్రీట్ లైట్స్ సక్రమంగా ఉండేలా చూస్తానని అరులైన వారికి పెన్షన్లు రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానని హామీలు ఇచ్చారు .. కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

