BRS Sheep Scam (imagecredit:twitter)
తెలంగాణ

BRS Sheep Scam: గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కదలిక.. ఈడీ నోటీసులు..?

BRS Sheep Scam: సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో కదలిక మొదలైంది. ఈనెల 15న విచారనకు రావాలని కేసులో బాధితులుగా ఉన్న గొర్రెల విక్రయందారులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. గొల్లకురుమల జీవితాలను మార్చేసే స్కీం అంటూ బీఆర్ఎస్​(BRS) ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని కోసం అప్పట్లో 12వేల కోట్ల రూపాయలను కేటాయించింది. 20 గొర్రెలు, ఒక పొట్టేల్ తో కూడిన యూనిట్ ధరను లక్షా 25వేలుగా నిర్ణయించింది. ఈ ధరకు యూనిట్లు కొని లబ్దిదారులకు పంపిణీ చేయాలని నిశ్చయించింది.

ప్రైవేట్ కాంట్రాక్టర్…

అయితే, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ లు స్కీంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత పథకం స్వరూపమే మారి పోయింది. ప్రభుత్వ ఆమోదం లేకుండానే యూనిట్ ధర లక్షా 25వేల నుంచి లక్షా 75వేలకు పెరిగింది. పోనీ పథకాన్నయినా సక్రమంగా అమలు చేశారా? అంటే అదీ లేదు. గొర్రెల విక్రయందారుల నుంచి యూనిట్లు కొని వారికి డబ్బులు చెల్లించకుండా సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన ఏడుకొండలుతోపాటు మరికొందరి నుంచి యూనిట్లు కొని వారికి ఇవ్వాల్సిన 2.1 కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టారు. హైదరాబాద్ వచ్చి అధికారులను కలిసి రావాల్సిన డబ్బు గురించి అడిగితే ఏ ఒక్కరూ స్పందించ లేదు. దాంతో బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కుంభకోణం తీగ కదిలింది. నిజానికి గొర్రెల పంపిణీ పథకంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో దర్యాప్తు మొదలు పెట్టిన ఏసీబీ అధికారులు దాదాపు 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నిర్ధారించారు. 

Also Read: GHMC: జీహెచ్ఎంసీ కొత్త ఆలోచన.. ఖైరతాబాద్ రాజ్‌భవన్ రోడ్డుపై.. ప్లాస్టిక్ టైల్స్ ప్రయోగం

ఈడీ ఎంట్రీ…

దీంట్లో మనీలాండరింగ్ జరిగినట్టుగా ఆరోపణలు రావటంతో ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్టుగా నిర్ధారించారు. లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేయకుండానే చేసినట్టుగా రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టారని తేల్చారు. కాగా, కొన్ని రోజులుగా కేసు దర్యాప్తులో స్తబ్దత నెలకొంది. దీనిపై ‘స్వేచ్ఛ’ ఇటీవలే ‘నత్తనడకన సంచలన కేసులు’ అన్న శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఈడీ అధికారులు కేసులో బాధితులుగా ఉన్న గొర్రెల విక్రయందారులు ఏడుకొండలుతోపాటు మరికొందరికి ఈనెల 15న విచారణకు రావాలని సమన్లు జారీ చేయటం గమనార్హం.

ఎప్పుడు రప్పిస్తారు…?

కాగా, ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మొయినుద్దీన్​, అతని కుమారుడు ఇక్రముద్దీన్​ ను ఎప్పుడు వెనక్కి రప్పిస్తారన్నది ఇప్పటికీ సస్పెన్స్​ గానే ఉంది. గొర్రెల పంపిణీ పథకంలో కుం భకోణం వెలుగు చూడగానే ఈ ఇద్దరు దుబాయ్ పారిపోయారు. వీరిని స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటి వరకు ఏసీబీ…ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా జరిగిన ఈ స్కాంలో కొందరు బీఆర్​ఎస్​ పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేవలం అధికారులు ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడతారంటే నమ్మశక్యంగా లేదని పోలీసు వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మొయినుద్దీన్​, ఇక్రముద్దీన్​ లను వెనక్కి రప్పించి క్షుణ్నంగా విచారిస్తేనే ఈ స్కాంలో ఉన్న అసలు ‘బ్లాక్ షీప్స్​’ ఎవరన్నది స్పష్టం అవుతుందని అంటున్నాయి. ఈ దిశగా ఇప్నటికైనా ఏసీబీ..ఈడీ అధికారులు చర్యలు తీసుకుంటారో? లేదో? వేచి చూడాల్సిందే.

Also Read: Coolie Monica Song: జుమ్ జుమ్ జుమ్‌తాక్.. ‘కూలీ’ మోనికా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..

Just In

01

Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్

Offers On iPhone: ఐఫోన్14పై భారీ డిస్కౌంట్.. ఎప్పటినుంచంటే?

Hyderabad Crime: కూకట్ పల్లి కేసులో కీలక అప్డేట్స్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

Raghava Lawrence: అప్పుడు కష్టపడిన డబ్బుతో కొన్న ఇంటిని.. లారెన్స్ ఏం చేశాడో తెలుసా?

Girls on Married Men: పెళ్లైన మగాళ్లపై అమ్మాయిలు ఎందుకు మోజు పడుతున్నారు? దాని వెనుకున్న కారణాలివే!