DGP Shivdhar Reddy: ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్(Pramod Kumar) కుటుంబానికి డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) భరోసా కల్పించారు. నిజామాబాద్‌లో ఇటీవల రియాజ్ అనే నేరస్థుడిని అరెస్ట్ చేసి తీసుకువస్తున్న క్రమంలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబీకులను ఆయన కలిశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక ఆదేశాల మేరకు తాను వచ్చానని వారికి వెల్లడించారు. ప్రమోద్ హత్యకు గురైన సంఘటన దురదృష్టకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపర్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని తెలిపారు.
Aso Read; Diwali Safty Alert: దీపావళి వేళ వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ఆదేశాలు
అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల కుటుంబాలకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి(MLA Dr. R Bhupathi Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Vinay Krishna Reddy)లతో కలిసి డీజీపీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. జిల్లాలో 1989 నుండి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అమరులయ్యారని, వారిలో 9 కుటుంబాలకు ఇందల్వాయి మండలం గన్నారం శివారులో 300 గజాల చొప్పున స్థలాలు అందించడం జరిగిందని వెల్లడించారు. మిగతా 9 కుటుంబాలు కూడా ముందుకు వస్తే, వారికి సైతం అదే ప్రాంతంలో ఇస్తామని తెలిపారు.
మావోయిస్టులు లొంగిపోండి
తెలంగాణలో మరో 65 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారని డీజీపీ తెలిపారు. వారందరూ నిర్భయంగా లొంగిపోవాలని అన్నారు. పోలీస్, రెవెన్యూ, మీడియా ఎవరి ఆధ్వర్యంలోనైనా లోంగిపోవచ్చని సూచించారు. ఎలాంటి కేసులు ఉన్నా కొట్టివేస్తామని స్పష్టం చేశారు.
Also Read: TDP Telangana: ఏళ్లు గడుస్తున్నా నో రెస్పాన్స్.. పార్టీలో ఉండాలా వద్దా.. డైలమాలో నాయకులు
