DGP in Trouble: మాకో న్యాయం పోలీసులకో న్యాయమా.
DGP in Trouble (imagecredit:twitter)
Telangana News

DGP in Trouble: మాకో న్యాయం పోలీసులకో న్యాయమా.. చట్టం మీకు చుట్టమా!

DGP in Trouble: రాష్ట్ర డీజీపీ సర్కారుకు బాజీ పడ్డారు. వెయ్యి రెండు వేలు కాదు ఏకంగా 68.67 లక్షల రూపాయలు. ప్రభుత్వానికి డీజీపీ బాకీ పడటం ఏందీ? అని అనుకుంటుంటున్నారా? ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీస్ వాహనాలపై విధించిన 17,391 చాలాన్లకు సంబంధించిన మొత్తం ఇది. సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చాలాన్లు విధించే విషయం తెలిసిందే. దీని కోసం సీసీ కెమెరాలను సైతం ఉపయోగించుకుంటున్నారు. హెల్మెట్ ధరించక పోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, రాంగ్ రూట్లో వెళ్లినా ఫోటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించని పోలీసులు

ఎక్కడైనా సదరు వాహనదారుడు తనిఖీల్లో పట్టుబడితే అతనిపై ఎన్ని చాలాన్లు పెండింగ్ లో ఉన్నాయి? ఎంత మొత్తం చెల్లించాల్సి ఉందన్న లెక్కలు తీస్తున్నారు. పెండింగ్ జరిమానా కట్టే వరకు వాహనాన్ని తిరిగి ఇవ్వటం లేదు. సగం కడతాం మిగితాది కూడా త్వరలోనే కట్టేస్తాం అని బతిమాలుకున్నా వో సబ్ నహీ జాన్తే మొత్తం కట్టాల్సిందే అని చెబుతూ వాహనాలను సీజ్ చేస్తున్నారు. వాటిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు వెయ్యటం ఓకే మరి పోలీస్ వాహనాలపై ఉన్న చాలాన్ల పెండింగ్ సంగతి ఏందీ? అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. పోలీస్ శాఖ కోసం కొనే ప్రతీ ఒక్క వాహనం డీజీపీ పేర రిజిస్టర్ అయి ఉంటాయి. వీటిని ఉపయోగిస్తున్న సిబ్బందిలో కొందరు మేమే పోలీసులం మాకెవ్వరు జరిమానాలు వేస్తారనుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు.

Also Read: Kedarnath Helicopter Crash: గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు.. రెండు నెలల గ్యాప్‌లో…

పోలీస్ వెహికిల్స్‌ని సీజ్ చేయాలని డిమాండ్

హెల్మెట్లు ధరించక పోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోక పోవటం, రాంగ్ రూట్లలో వెళ్లటం ఇలా అన్నిరకాల ఉల్లంఘనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ వాహనాలపై 17,391 చాలాన్లు పడగా 68.67లక్షల మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై సాధారణ జనంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మా వాహనాలను సీజ్ చేసినట్టే పోలీస్ వెహికిల్స్ ని కూడా సీజ్ చెయ్యాలన్న డిమాండ్ వారి నుంచి వినిపిస్తోంది. మాకొక న్యాయం పోలీసులకు ఒక న్యాయమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. డిస్కౌంట్ ఆఫర్లో కూడా పోలీసులు జరిమానాలు క్లియర్ చేసుకోక పోవటంపై కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Air India Crew: అడ్డంగా దొరికిపోయిన ఎయిరిండియా సిబ్బంది

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..