Sangareddy District: జిల్లా స్థాయి కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులకు అధికారాలను కట్టిబెట్టేందుకు ఏఐసీసీ నిర్ణయించిందని, ఏఐసీసీ పరిధిలోని కాంగ్రేస్ ఎన్నికల కమిటీలో డీసీసీ అధ్యక్షులకు కొత్తగా అవకాశం కల్పించనుందని ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు జరిత అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేసేందుకు పార్టీ తరపున డీసీసీ అధ్యక్షుల ఆమోదం అవసరమని అన్నారు. దేశ మంతా కుల గణన జరగాలన్నది కాంగ్రేస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కోరికయని అన్నారు.
గతంలో డీసీసీ అధ్యక్షులు కేవలం మీటింగ్‌లు నిర్వహించడం, కార్యకర్తలను సమీకరించడం కేవలం జిల్లాకు మాత్రమే పరిమితమయ్యే వారన్నారు. కార్యకర్తల్లో నుంచే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. జహీరాబాద్ నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 50కిపైగా డీసీసీ అధ్యక్షుడి పదవి కోసం ధరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈనెల 18వ తేది వరకు ధరఖాస్తులను స్వీకరించి, సంగారెడ్డిలోనే ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల వారిగా సేకరించిన ధరఖాస్తుల్లో అభ్యర్థులను జిల్లా కేంద్రంలోనే ఇంటర్వ్యూ చేస్తామని, ఇందులో నుంచి ఆరు గురి పేర్లను గుర్తించి ఏఐసీసీకి పంపుతామని అన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కాంగ్రేస్ నేత రాహుల్ గాంధీలు అధ్యగక్షుని ప్రకటిస్తారన్నారు.పార్టీలో మహిళల బాగస్వామ్యం కూడా అవసరమని, ఈ సమావేశానికి ఒక్కరు కూడా మహిళలు రాలేదని, మహిళలను కూడా రాజకీయంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. 50 శాతంలో 50 సంవత్సరాల లోబడి వయస్సున్న వారికి అవకాశాలు కల్పించేందుకు పార్టీ ఆలోచిస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రజాపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, పార్టీలో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. పీసీసీ పరిశీలకులు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు, పిసీసీ ఉపాధ్యాక్షుడు సంగమేశ్వర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రాష్ట్ర ఫెడ్కాన్ డైరెక్టర్ జగన్మొహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎం.జగన్మొహన్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్లు చిట్టిబాబు, సురేందర్‌గౌడ్, డి.శంకర్, సురేష్, పుల్కల్ మండల నాయకులు ఈశ్వర్‌గౌడ్, శ్రీహరి,రాంచెంద్రారెడ్డిలు పాల్గొన్నారు.
