Cyber Crime: మీకు క్రెడిట్ కార్డ్ ఉందా గుడ్ న్యూస్ అంటూ..?
Cyber Crime (imagecredit:twitter)
Telangana News, క్రైమ్

Cyber Crime: మీకు క్రెడిట్ కార్డ్ ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్ అంటూ..?

Cyber Crime: సైబర్ క్రిమినల్స్ నయా మోసాలు పెరిగిపోతున్నాయి. క్రెడిట్ కార్డుల పేర నేరాలు చేస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు. ఎంత అవగాహన కల్పించినా ఇప్పటికీ జనం కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటూనే ఉన్నారు. కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. తీరా మోసం జరిగిందని తెలిశాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

33 రకాలకు పైగా మోసాలు

ఏయేటికాయేడు సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. 33 రకాలకు పైగా మోసాలు చేస్తున్న కేటుగాళ్లు ప్రతీ సంవత్సరం వందల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే జనంలోని అత్యాశ, భయమే వారికి ఉపయోగ పడుతున్నది. మరికొన్నిసార్లు తొందరపాటుతనం కూడా సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నది. నిన్నమొన్నటి వరకు ఏపీకే ఫైళ్లు(APK Fiels), డిజిటల్​ అరెస్టులు(Digital Arest), ఇన్వెస్ట్‌మెంట్ పేర వరుసగా మోసాలు చేస్తూ వచ్చిన సైబర్ నేరగాళ్లు తాజాగా రూటు మార్చారు. క్రెడిట్ కార్డుల పేర నయా మోసాలకు తెర లేపారు. ప్రైవేట్​ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, మీ సేవా(Meeseva) సెంటర్ల నుంచి రకరకాల మార్గాల్లో జనానికి సంబంధించి పర్సనల్​ డేటా మొత్తం తీసుకుంటూ ఆ తరువాత నేరాలకు తెర లేపుతున్నారు. ఒకేసారి వందలు, వేల సంఖ్యలో మొబైల్ ఫోన్లకు మెసెజీలు పంపిస్తూ టోకరా వేస్తున్నారు. తాము చేసే నేరాలకు సైబర్ క్రిమినల్స్​ సోషల్​ మీడియా ప్లాట్ ఫాంలను వాడుకుంటున్నారు. వేర్వేరు బ్యాంకులకు చెందిన నకిలీ వెబ్​ పేజీలపై అచ్చం అసలైన వాటిలా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. కస్టమర్ కేర్ అవసరమైన వారు ఈ వెబ్​ పేజీలను నిజమైనవని నమ్మి వాటిల్లో ఉండే నెంబర్లకు ఫోన్లు చేస్తే అచ్చం కస్టమర్ కేర్ సర్వీస్ సిబ్బందిలానే మాట్లాడుతున్నారు. అప్​ డేట్ చేయాలంటూ క్రెడిట్ కార్డులు, ఓటీపీల వివరాలు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఇవి చేతికి చిక్కగానే అవతలి వారి బ్యాంక్ ఖాతాలను ఊడ్చేస్తున్నారు. కొన్నిసార్లు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెబుతూ పని పూర్తి చేసేస్తున్నారు. మాల్వేర్ యాప్‌లు, ఏపీకే ఫైళ్లను డౌన్ లోడ్​ చేయించి కొన్నిసార్లు నేరాలు చేస్తున్నారు.

Also Read: Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

స్కిమ్మర్లను వాడుతూ..

కొన్నిసార్లు నేరగాళ్లు ఏకంగా క్రెడిట్ కార్డులను క్లోనింగ్​ చేస్తున్నారు. చాలామంది కార్డులను ఉపయోగించి ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు షాపింగ్​‌కు వెళ్లినప్పుడు కూడా బిల్లుల చెల్లింపు కోసం వీటిని వాడుతుంటారు. దీనిని అవకాశంగా చేసుకుంటున్న కేటుగాళ్లు క్రెడిట్ కార్డును ఇన్ సర్ట్​ చేసే ప్రాంతంలో స్కిమ్మర్లను అమరుస్తున్నారు. ఇవి పెట్టిన తరువాత కార్డును స్వైప్ చేస్తే దానిపై ఉండే మాగ్నటిక్​ కోడ్​ స్కిమ్కర్‌లో కాపీ అవుతుంది. ఆ తరువాత ఆ కోడ్‌తో నకిలీ క్రెడిట్ కార్డులను తయారు చేసి ఖాతాల్లో ఉన్న డబ్బును కొల్లగొడుతున్నారు. ఇంకొన్నిసార్లు క్యాష్​ బ్యాక్​, రివార్డులు అంటూ వివరాలు తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారు.

సైబర్ క్రైమ్ పోలీసుల సూచనలు

ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు పెరిగి పోతుండడంతో మోసాల బారిన పడకుండా ఉండేందుకు సైబర్ క్రైం పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. వెబ్ సైట్లలో ఆయా బ్యాంకుల పేజీలను సందర్శించినప్పుడు అవి నిజమైనవా కాదా అనే విషయాన్ని గమనించాలని చెప్పారు. క్రిమినల్స్ అసలు వెబ్ పేజీల్లా డూప్లికేట్ పెడుతున్నా చిన్న చిన్న తేడాలు ఉంటాయన్నారు. ఇక, ఆ పేజీల్లో ఉండే కస్టమర్ కేర్ నెంబర్లకు ఫోన్ చేసినప్పుడు అవతలివారు క్రెడిట్ కార్డు, ఓటీపీ వివరాలు అడిగితే వెంటనే సందేహించాలని సూచించారు. ఏ బ్యాంక్ కూడా ఓటీపీ వివరాలు అడగదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. అలాగే రీ ఫండ్, ట్రాన్సాక్షన్‌ను ఫిక్స్ చేసేందుకు కూడా బ్యాంకులు యాప్​‌లను డౌన్​ లోడ్​ చేయమని అడగవన్న విషయాన్ని గమనించాలని సూచించారు. తరచూ బ్యాంకింగ్ యూపీఐ, ఈ మెయిల్ పాస్ వర్డులను మార్చాలని చెప్పారు. మల్టీ ఫ్యాక్టర్​ అథెంటికేషన్‌ను పెట్టుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు బ్యాంక్​ అకౌంట్లను తనిఖీ చేసుకుంటూ ఉండాలని చెప్పారు. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే బ్యాంకుకు సమాచారం ఇచ్చి ఖాతా నుంచి లావాదేవీలు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. దాంతోపాటు cybercrime.gov.in వెబ్​ సైట్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సైబర్ అప్ డేట్స్ కోసం https://www.facebook.com/cybercrimepshyd, https://www.instagram.com/cybercrimepshyd, https://x.com/CyberCrimeshyd/ను ఫాలో కావాలని సూచించారు.

Also Read: Akhanda2: పూనకాలు తెప్పిస్తున్న బాలయ్య బాబు ‘అఖండ 2: తాండవం’.. ఇది చూస్తే షాక్ అవుతారు..

Just In

01

Balkapur Nala: క‌నుమ‌రుగ‌య్యే ప్రమాదంలో వాగు.. అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు

Bharani Emotional: బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత భరణి ఎమోషనల్.. ఏం చెప్పారు అంటే?

India Russia Trade: భారత్–రష్యా వాణిజ్యంలో కొత్త మలుపు.. 300 ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు

Lionel Messi: ఢిల్లీలో అడుగుపెట్టిన మెస్సీ.. ఒక్కసారి షేక్‌హ్యాండ్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ఫీజు ఎంతంటే?

Crime News: నూతన సంవత్సర వేడుకల కోసం డ్రగ్స్ దందా.. పట్టేసిన పోలీసులు