Covid-19 Cases (imagecredit:twitter)
తెలంగాణ

Covid-19 Cases: దేశంలో కరోనా హల్చల్.. పెరుగుతున్న కరోనా కేసులు!

Covid-19 Cases: ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోను కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు ఒక కొత్త రూపంలో కరోనా తన పంజా విసురుతుంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం నిపుణులు తెలియచేశారు. NB.1.8.1, LF.7 అనే కరోనా కరోనా వేరియంట్స్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. రాష్ట్రాల్లో అన్ని సౌకర్యాలతో ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది.

Also Read: Mahabubabad: మహబూబాబాద్ ఆర్టీవో ఆఫీసులో అక్రమ వసూళ్లు.. డోంట్ కేర్!

దేశంలోనే అత్యధిక కేసులు కేరళ

దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా ఇన్‌ఫెక్షన్లు వెలుగులోకి వచ్చాయి. కేరళలో 200 మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆస్పత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. మహారాష్ట్రలోనూ భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు అంటున్నారు. కర్నాటకలో 35 కరోనా కేసులు నమోదుకాగా, ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండగా నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డ్‌ అయింది. గాజియాబాద్‌లో ఇప్పటికే 4 కేసులు, తమిళనాడులో సైతం పెరుగుతున్న కరోణా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైన కరోనా

కరోనా కలవరం తెలుగు రాష్ట్రాల్లోను మోదలైంది. తెలుగు రాష్ట్రాల్లో 5 కరోనా కేసులు నమోదకాగా, తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైందని వైద్యశాక తెలిపింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. బాధితుడిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో 25 పడకల వార్డును సిద్ధం చేసింది. ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్‌ పెడుతున్నాయి. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో రెండు కేసులు నమోదవడంతో ఆందోళనతో, వెంటనే ప్రభుత్వం అలెర్ట్‌ అయ్యింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ జీజీహెచ్‌లో కరోనా ప్రత్యేక వార్డును ఎర్పాటు చేశారు. దేశంలో మోత్తం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

Also Read: Social Welfare Gurukul Schools: సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్నయం!

 

 

 

 

 

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు