KTR Vs Konda Surekha: మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావాపై విచారణలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు (KTR Vs Konda Surekha) చుక్కెదురైంది. మంత్రిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అంశాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను 2026 ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు.
Read Also- GHMC BJP: జీహెచ్‌ఎంసీలో వార్డుల డీలిమిటేషన్‌పై భగ్గుమన్న బీజేపీ.. అభ్యంతరాలు ఇవే
నిర్దేశిత గడువులోగా మంత్రి కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాల్లో నాంపల్లి కోర్టు పేర్కొంది. అంటే, తదుపరి విచారణలో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీని కోర్టు పరిశీలన చేయనుంది. కాగా, తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు గురువారం విచారణ జరిపింది. కోర్టు రికార్డుల ప్రకారం, పిటిషన్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. అయితే, గురువారం నాడు ఫిర్యాదుదారుతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా విచారణకు హాజరుకాలేదు.
Read Also- Akhanda 2: ‘అఖండ 2’కు షాకుల మీద షాకులు.. టికెట్ల ధరల హైక్, ప్రీమియర్ అనుమతి జీవో వెనక్కి!

