Uttam Kumar Reddy: పురపాలక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. అందుకే స్వచ్ఛందంగా కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.
నోటిఫికేషన్ మరో మూడు రోజుల్లో విడుదల
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మరో మూడు రోజుల్లో విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు రాకుంటే అధైర్య పడొద్దని, వారికి నామినేటేడ్ పదవులు ఇస్తామన్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ, 90 శాతం మున్సిపల్‌లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలును బీజేపీ అడ్డుకుందని మండిపడ్డారు. మున్సిపల్‌లలో అధికార కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరవేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Uttam Kumar Reddy: మున్నేరు, పాలేరుకు రూ.162.57 కోట్లు.. ఆకస్మిక వరదలతో జరిగే నష్టాలకు చెక్!

