Srinivas Goud: మేడిగడ్డ బ్యారేజీని ఎందుకు రిపేర్ చేయట్లేదు?
Srinivas Goud ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Srinivas Goud: మేడిగడ్డ బ్యారేజీని ఎందుకు రిపేర్ చేయట్లేదు? : మాజీ మంత్రి  శ్రీనివాస్ గౌడ్!

Srinivas Goud: మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ పార్టీ నేతలే పేల్చారని మాజీ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను రిపేర్ ఎందుకు చేయలేదని నిలదీశారు. పాత కాంట్రాక్టు సంస్థకు ఎందుకు రిపేర్ పనులు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో మాట్లాడారు. కొడంగల్ లో జరిగిన సర్పంచుల మీటింగ్ లో రేవంత్ రెడ్డి బూతు మాటలు మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని,సర్పంచులకు సీఎం ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలన్నారు. తొండలు,పేగులు గురించి సీఎం మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ తెలంగాణ తేకుండా ఉంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా?జైపాల్ రెడ్డి ఇంగ్లీషులో మాట్లాడితే పదాలకు అర్ధం డిక్షినరీలో వెతుక్కునే వారు.రేవంత్ రెడ్డి మాట్లాడే బూతులు ఏ డిక్షనరీలో చూడాలన్నారు.

Also Read: Srinivas Goud: బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ హత్యలే : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావాలి

గాంధీ కుటుంబంలో వారసులు రాజకీయాల్లోకి రాలేదా? అని నిలదీశారు. రెండు ఎంపీల నుంచి బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిందని, నాలుగు వేల గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి సర్పంచులు ఉన్నారని, బీఆర్ఎస్ ఎట్లా ఖతం అవుతుందన్నారు. ఆంధ్రా వాళ్లకు ఆస్తులు సంపాదించుకునే అవకాశం కేసీఆర్ కల్పించారన్నారు. కేసీఆర్ హయాంలో ఆంధ్రా ప్రాంతం వాళ్ళు బాగుపడ్డారని, కేసీఆర్ ఏదైనా చిన్న మాట అంటే దాన్ని సాకుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  కేసీఆర్ ఆంధ్రా,తెలంగాణ అనే తేడా లేకుండా పాలన చేశారన్నారు.భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. కేసీఆర్ మూడవ సారి సీఎం అవుతారని భీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్,బీజేపీ కలిసి పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారెంటీ అమలు అయ్యాయా చూపించాలి

42 శాతం రిజర్వేషన్లతో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు పెట్టాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేక కేసీఆర్ పై బూతులు మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఆరు గ్యారెంటీ అమలు అయ్యాయా చూపించాలని డిమాండ్ చేశారు. నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను.రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో పోటీ పడ్డామన్నారు.కోస్గి టౌన్ ఎట్లా అభివృద్ధి అయిందో చూడు రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రులు,ఎమ్మెల్యేలు భూదందాల్లో,కమీషన్లలో పోటీ పడుతున్నారని రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందని ఆరోపించారు.

Also Read: Srinivas Goud: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడతాం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Just In

01

Accreditation Guidelines: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ మార్గదర్శకాలపై మీడియా అకాడమీ చైర్మన్ స్పందన

Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టు పార్టీ లేకపోతే చట్టాలు, హక్కులు ఉండేవి కాదు : సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు!

GHMC: జీహెచ్ఎంసీలో మరోసారి అంతర్గత మార్పులు.. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఛాన్స్?

Brave boy Sravan: ఆపరేషన్ సింధూర్‌లో సైనికులకు సాయం.. 10 ఏళ్ల బాలుడికి ప్రతిష్టాత్మక కేంద్ర పురస్కారం

Medaram Temple: ప్రతి చిహ్నానికి ఆదివాసీ చరిత్రే ఆధారం.. నమస్తే తెలంగాణ కథనంపై ఆదివాసి సంఘాల ఆగ్రహం!