Srinivas Goud: బీసీ రిజర్వేషన్ల కొరకై అమరుడైన సాయి ఈశ్వర చారి ని స్మరించుకుంటూ, హైదరాబాద్(Hyderabad) లోని గన్ పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్,(Srinivas బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ , వేముల రామకృష్ణ , గణేష్ చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తొలి అమరుడు శ్రీకాంతాచారి అయితే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 42% బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలలో ఇవ్వకుండా మోసంచేసినందుకు ఈశ్వర చారి తన ప్రాణ త్యాగం చేశారని వెల్లడించారు.
కేంద్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది
తన ప్రాణ త్యాగంతో నైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చు రిజర్వేషన్లు ఇస్తుందన్న భావనతో ఆత్మ బలిదానం చేసుకున్న ఈశ్వర చారిని స్మరించుకుంటూ గన్ పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, జోహార్లు అర్పించినట్లు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ ల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఇచ్చిన జీఓ లను అమలు చేయకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
Also Read: Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
కోట్ల రూపాయలను దుబారాగా ఖర్చు
అందాల పోటీలు, సమ్మిట్లు నిర్వహించి కోట్ల రూపాయలను దుబారాగా ఖర్చు చేస్తుందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా, ఉన్న రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించి మోసం చేసిందన్నారు. బీసీ సంఘాలు, ప్రజా ఉద్యమాలు చేసిన ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం తరహా, బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ ఉద్యమాలు దేశానికి ఆదర్శంగా ఉంటాయని, బీసీల హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
Also Read: Srinivas Goud: బీసీరిజర్వేషన్లుకు చట్టబద్దత కల్పించాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

