Sama Rammohan: బీఆర్ఎస్ హయంలో చెట్ల నరికివేతపై చర్చకు సిద్ధమా? అంటూ కాంగ్రెస్ ( Congress) మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan) పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు చెట్ల నరికివేతపై చర్చిద్దామని సవాల్ విసిరారు.
ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ… కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందనే విషయాన్ని ( Brs) బీఆర్‌ఎస్ లిఖితపూర్వకంగా ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు.
డీమ్డ్ ఫారెస్ట్ ను అధికారికంగా ప్రకటించడంలో అడ్డంకులు ఏమీ ఉన్నాయని నిలదీశారు. పదేళ్ల పాటు నిర్లక్ష్యం వహించారన్నారు. మైహోమ్ లగ్జరీలకు అప్పగించాలని ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
ఇప్పటికే నిర్మించిన మై హోమ్ అపార్ట్ మెంట్లకు పర్మిషన్లు, పర్యావరణ అనుమతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు బీఆర్‌ఎస్ ( Brs) ప్రభుత్వం హరిత హారం పేరిట (Hyderabad Central University) హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సహజంగా పెరిగిన వృక్షాలను నరికేసి మొక్కలు నాటించిందన్నారు.
కానీ నాటిన ఏ మొక్క బతకలేదన్నారు. వందల కొద్దీ వృక్షాలు నరికివేయడం నిజాం కదా అని? ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 16లో కేసీఆర్ స్వయంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) లో చెట్లు నరికించి, మొక్కలు నాటిన విషయం హరీష్ రావుకు గుర్తు లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార వృద్ధి కోసం బీఆర్ ఎస్ వందల ఎకరాలను మైనింగ్, ఇండస్ట్రీయల్ కు ఇచ్చిందన్నారు. ప్రతిపక్షంలోకి రాగానే బీఆర్ ఎస్ కు పర్యావరణం గుర్తుకు వచ్చిందన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు