Political News:
కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి పలువురు నేతలు, కార్యకర్తలు
ముందే చెప్పిన ‘స్వేచ్చ’.. కథనం చర్చనీయాంశం!
జాబితాలో రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగానరేందర్
జీవన్ రావు, స్వామి నాయక్‌తో పాటు పలువురు నాయకులు కూడా
కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో చేరిక
హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు భారీ కాన్వాయ్‌తో పయనం!
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: మెదక్ జిల్లా మెదక్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ తగిలింది. రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, న్యాయవాది జీవన్ రావు, స్వామి నాయక్‌లతో పాటు పలువురు మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు భారీ కాన్వాయ్‌తో సోమవారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం నుంచి 100 కార్లలో హైదరాబాద్ బయలుదేరారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
Read Also- Heart Diseases: గుండె వ్యాధులకు అసలు కారణాలు ఇవేనని మీకు తెలుసా?
కాన్వాయ్‌ను మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారు తిరిగి బీఆర్‌ఎస్‌లోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇక, గంగానరేందర్, జీవన్ రావు, స్వామినాయక్ మాట్లాడుతూ, పదవుల కోసం బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదని, ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలు నచ్చకనే బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. మీడియా ప్రకటన చేసిన రత్వాత హైదరాబాద్ బయలు దేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు భట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు సోములు, రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ప్రభు రెడ్డి ఆర్కే శ్రీనివాస్, రాజు, మామిళ్ల ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.
Read Also- Rupee Fall: మన ‘రూపాయి’కి ఏమైంది?.. ఇవాళ ఒక్కరోజే భారీ పతనం
కాగా, మైనంపల్లి హన్మంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిపై రోహిత్ 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. ఇక, మైనంపల్లి హన్మంతరావు 2023లో సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కొడుకు రోహిత్ రావు, తనకు టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ చేతిలో 49 వేలకు పైగా ఓట్ల తేడాతో హన్మంతరావు ఓటమి పాలయ్యారు.