Sama Ram Mohan Reddy: హరీశ్ రావు చేతుల్లో బీజేపీ: సామ
Sama Ram Mohan Reddy (Image Source: twitter)
Telangana News

Sama Ram Mohan Reddy: హరీశ్ రావు చేతుల్లో బీజేపీ.. కమలం రాష్ట్రాధ్యక్షుడు కీలుబొమ్మ.. సామ సంచలన వ్యాఖ్యలు

Sama Ram Mohan Reddy: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదు కాబోతున్నట్లు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని బీజేపీ రిమోట్ కంట్రోల్ బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలు బొమ్మల్లా మారిపోయారని విమర్శించారు.

ఇకపై హరీశ్ రావు కార్యక్రమాలకు కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక వేసిందని సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు వ్యూహాంలో బీజేపు చిక్కుకుందని తన ఎక్స్ ఖాతాలో సామ రాసుకొచ్చారు. ప్రస్తుతం సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో మరోమారు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. బీఆర్ఎస్ ను బీజేపీ గూటిలోకి హరీశ్ రావు చేరబోతున్నారన్న ప్రచారాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చినట్లైంది.

Also Read: 19 Minutes Viral Video: టీనేజర్స్ ప్రైవేటు వీడియో.. యువతి చనిపోయిందంటూ పుకార్లు.. నిజమెంత?

హరీశ్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు గతంలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కేసీఆర్, కేటీఆర్ లతో హరీశ్ రావుకు విభేదాలు ఉన్నాయని.. అందుకే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ గతంలో పలు కథనాలు వెల్లువడ్డాయి. కానీ ఈ ప్రచారాన్ని హరీశ్ రావు ఖండిస్తూనే వచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన కవిత సైతం హరీశ్ రావునే టార్గెట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ లను ఆయన మోసం చేస్తున్నట్లు ఆరోపించారు.

Also Read: CM Revanth Reddy: నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్ కోసం ఎంతవరకైనా వెళ్తా.. ప్రధానికి రేవంత్ ఛాలెంజ్!

Just In

01

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!