CM Revanth Reddy: రాహుల్ కోసం ఎంతవరకైనా వెళ్తా: సీఎం
CM Revanth Reddy (Image Source: Twitter)
Telangana News

CM Revanth Reddy: నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్ కోసం ఎంతవరకైనా వెళ్తా.. ప్రధానికి రేవంత్ ఛాలెంజ్!

CM Revanth Reddy: దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎం.. సోనియా, రాహుల్ పై నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మాట్లాడారు. సొంత ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభించి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ కుటుంబం కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థికంగా నిలబడేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కృషి చేశారని పేర్కొన్నారు. తిరిగి పత్రికను పునరుద్ధరించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అవసరమైందని అన్నారు. అందుకే మల్లికార్జున ఖర్గే లాంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులను బోర్డు డైరెక్టర్లుగా నియమించి పత్రికను పునరుద్ధరించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

‘ఎందాకైనా పోరాడతాం’

నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై మనీ లాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధిస్తున్నారని చెప్పారు. ‘ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు. ఆ విషయం నుంచి దృష్టి మరల్చేందుకు మళ్లీ కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అండగా నిలబడతామని, అవసరమైతే ఎందాకైనా పోరాడతామన్న సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వదలచుకున్నాం’ అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

‘సంక్షేమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లండి’

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటి మందికి కోటి చీరలను ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నాం. ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదే. గ్రామలవారీగా సమన్వయం చేసుకుంటూ పంపిణీ పూర్తి చేయాలి. డిసెంబర్ లోగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ పూర్తయ్యేలా చూడాలి. మార్చి నెలలో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 35 లక్షల చీరలను పంపిణీ చేయాలి. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, పరిపాలనపై గ్రామ గ్రామాన చర్చ పెట్టండి’ అని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ సూచించారు.

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు..

సంక్షోభంలో మనకు రాష్ట్రాన్ని అప్పగిస్తే… సంక్షోభం నుంచి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ నెల 7 న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ యూనివర్సిటీగా తీర్చి దిద్దుతాం. ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నాం. కోర్ అర్బన్ లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని CURE చేయాలని నిర్ణయించుకున్నాం. కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ బయటకు తరలిస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: 19 Minutes Viral Video: టీనేజర్స్ ప్రైవేటు వీడియో.. యువతి చనిపోయిందంటూ పుకార్లు.. నిజమెంత?

‘చేసింది చెప్పుకోవాలి’

రీజనల్ రింగ్ లోపల ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘రీజనల్ రింగ్ రోడ్ బయట రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ ( RARE) ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోబోతున్నాం. తెలంగాణలో మరో నాలుగు విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్టు ఏర్పాటు చేసుకోబోతున్నాం. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్ బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నాం. పనులు చేయడమే కాదు.. రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి. మనం చేస్తున్న పనులు, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి. రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: Telangana Govt: ఆదర్శవంతమైన నిర్ణయాలు.. ఆర్థిక భరోసా పథకాలు.. పారిశ్రామికవేత్తలతో పోటీ పడుతున్న మహిళలు

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం