Local Body Elections: స్థానిక ఎన్నికలు కాంగ్రెస్‌కు టాస్కేనా..!
Local Body Elections (magecredit:twitter)
Telangana News

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు టాస్కేనా.. విజయాలపై అభ్యర్ధులు స్క్రీనింగ్!

Local Body Elections: రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమైన పట్టు కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నది. సర్పంచ్ ఎన్నికల్లోనూ 90 శాతం స్థానాలను తమ పార్టీ ఫేవర్ అభ్యర్ధులు సాధించాలని కోరుకుంటున్న కాంగ్రెస్…ఆ దిశగా వ్యూహాలనూ అల్లుతుంది. ప్రధానంగా కాంగ్రెస్(Congress) ఫేవర్ అభ్యర్ధులుగా కొత్తగా రంగంలోకి దిగే నేతల్లో టెన్షన్ నెలకొన్నది. పాత నేతలను కాదని తమను పోటీలో దించినందున.. సీనియర్ లీడర్లు సంపూర్ణంగా సహకరిస్తారా? లేదా? అనే అంశంలో కొత్తగా పోటీ కి దిగుతున్న క్యాండిడేట్లలో ఆందోళన ఉన్నది. సమన్వయంగా తమకు సపోర్టు గా నిలుస్తారా? లేదా? అని సతమతమవుతున్నారు. ఈ మేరకు చాలా మంది కొత్త క్యాండిడేట్లు రాజకీయ అనుభవజ్ఞులు, సీనియర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. తమ విజయానికి స్ట్రాటజీలు చెప్పాలంటూ న్యూ క్యాండియేట్లు వేడుకుంటున్నారు.

టఫ్ సెగ్మెంట్లలో…?

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలు ఉండగా, 40 శాతం పంచాయితీల్లో వర్గపోరు నెలకొన్నది. ప్రధానంగా రిజర్వడ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ గ్రామ పంచాయితీల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఆయా సెగ్మెంట్లలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) మధ్య టఫ్​ ఫైట్ నెలకొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఈ క్రమంలో నే అప్పటి వరకు పార్టీలో పనిచేసిన రెండు వర్గాలుగా ఉన్న సీనియర్లను కాదని, స్థానిక ఎమ్మెల్యేలు కొత్త అభ్యర్ధులను రగంలోకి దించుతున్నారు. పాత నేతలు, కొత్త అభ్యర్ధులు కలిసి పనిచేయాల్సందేనని పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ, ఏమేరకు కొత్త అభ్యర్ధులకు మద్ధతు లభిస్తుందనేదే ప్రశ్నార్థకంగా మారింది. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న పాత నేతలను కాదని, ఎమ్మెల్యేల ఆశీస్సులతో బరిలోకి దిగుతున్న కొత్త అభ్యర్థులకు ‘సమన్వయ’ సక్సెస్ ను కల్గిస్తుందా? లేదా వెన్నుపోటు పొడుస్తారా? అనే టెన్షన్ గ్రామాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గతంలో వర్గ పోరుతో సతమతమైన పంచాయతీల్లో ఈసారి వ్యూహం మార్చాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాత గొడవలకు చెక్ పెట్టాలంటే కొత్త ముఖాలను తెరపైకి తేవడమే సరైన మార్గమని స్థానిక ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

Also Read: Mandhana Wedding: స్మృతి మంధాన పెళ్లి వాయిదా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్.. అసలు విషయం ఇదే..

ప్రజల నాడీ పై అనుమానాలు…?

సర్పంచ్​అభ్యర్థుల ఎంపిక వరకు ఎమ్మెల్యేల హవా నడుస్తున్నా, క్షేత్రస్థాయిలో ఓట్లు రాల్చేది మాత్రం స్థానిక క్యాడరే. దీంతో ప్రజల మద్ధతును కోరేందుకు అభ్యర్ధులు తమ ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. కానీ పాత నేతలు ప్రచారానికి దూరంగా ఉంటే పరిస్థితి ఏంటి? అన్న ఆందోళన అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లోని పంచాయితీల్లో ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి పాత నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. నామినేటెడ్ పదవులపై భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ టాస్క్ ను మండల స్థాయి నాయకులు సక్సెస్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు.

Also Read: Ponnam Prabhakar: హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్!

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!