Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా, ఏఐసీసీ(AICC) 40 మంది సభ్యులతో కూడిన స్టార్ క్యాంపెయినర్ల బృందాన్ని నియమించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) శనివారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(AICC incharge Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), సీనియర్ మంత్రులు, కీలక నేతలు ఉన్నారు.
ఈ 40 మంది ప్రముఖుల బృందం ఉప ఎన్నిక ప్రచారాన్ని డివిజన్ల వారీగా నిర్వహించనున్నది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి సీటును కైవసం చేసుకోవాలని పార్టీ పక్కా ప్రణాళికతో ఉన్నది. 40 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్లలో పార్టీ ప్రచార డ్రైవ్‌ను మరింత ముమ్మరం చేయనున్నది.
Also Read: Konda Surekha: మీనాక్షి నటరాజన్‌తో భేటీ తర్వాత మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు!
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్న ముఖ్య నేతలు
= మీనాక్షి నటరాజన్
= రేవంత్ రెడ్డి
= మహేశ్ కుమార్ గౌడ్
= విశ్వనాథం (ఏఐసీసీ కార్యదర్శి)
= భట్టి విక్రమార్క మల్లు
= ఉత్తమ్ కుమార్ రెడ్డి
= దామోదర రాజనర్సింహ
= సీతక్క
= పొన్నం ప్రభాకర్
= తుమ్మల నాగేశ్వర రావు
= పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
= వివేక్ వెంకటస్వామి
= హనుమంత రావు
= మహమ్మద్ అజారుద్దీన్
= మధు యాష్కీ గౌడ్
= సంపత్ కుమార్
= దానం నాగేందర్
= సీఎన్ రెడ్డి
= బాబా ఫసియుద్దీన్
Also Read: Harish Rao: పంచాయతీలు పెంచుకోవడానికే క్యాబినెట్ మీటింగ్: హరీష్ రావు
