JubileeHills By Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఆసక్తికరంగా హస్తం పార్టీ స్లోగన్
రెండు పార్టీలను ఇరకాటంలో పడేసిన కాంగ్రెస్
మైనార్టీ ఓట్లను టార్గెట్ చేసిన సర్కార్
ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు లక్షా 50 వేల ఓట్లు
కమ్మ ఓటర్లతో కుల డ్రైవ్
ఆసక్తికరంగా మారిన బై ఎలక్షన్ ట్రెండ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (JubileeHills By Poll) పార్టీల ప్రచారాస్త్రాలు, నినాదాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్‌కు ఓటేస్తే, బీజేపీకి వేసినట్లేనని కాంగ్రెస్ ప్రచారం చేయబోతున్నది. బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందాలు కుదిరాయని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో హైలెట్ చేయనున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రచారంతో పాటు బీఆర్ ఎస్ కు ఓటేస్తే, బీజేపీకి సహకరించినట్లేననే స్లోగన్ ను హస్తం ఎత్తుకోనున్న ది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని, ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లోనూ ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు మరోసారి సిద్ధమయ్యాయని కాంగ్రెస్ చెప్తున్నది. జూబ్లీహిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ అనౌన్స్ చేయనున్నది. ఎన్నికల ప్రచారం చివరి వరకు ఇదే లైన్ లో పబ్లిసిటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్న ది. దీని వలన మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపు డైవర్ట్ అవుతారని టీ పీసీసీ భావిస్తున్నవి. ఇదే అంశంపై జూమ్ మీటింగ్ లోనూ ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నట రాజన్ ఆరా తీశారు. ఈ స్లోగన్ వలన కాంగ్రెస్ కు మరింత మైలేజ్ వస్తుందని మెజార్టీ లీడర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మైనార్టీ ఓటర్లు టార్గెట్?
ముస్లీం, క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు మొదట్నుంచీ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి బలమైన అభ్యర్ధి లేనందున…బీఆర్ ఎస్ గెలిపించేందుకు బీజేపీ అంతర్గతంగా ఒప్పందాలు కుదుర్చుకున్నదని కాంగ్రెస్ చెప్తున్నది. దీని వలన బీఆర్ ఎస్ ఎవరైన ఓటేస్తే..బీజేపీకి సహకరించినట్లేనని కాంగ్రెస్ వివరిస్తున్నది. దీంతో లక్షన్నర మంది ఉన్న మైనార్టీల్లో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లుతాయని ఆ పార్టీ భావన. పైగా మజ్లీస్ కూడా నవీన్ యాదవ్ కు సపోర్టు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అంతేగాక ఇప్పటికే చిత్ర పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులతో పాటు పరిశ్రమ అధినేతలు, వ్యాపార వేత్తలందరితోనూ కాంగ్రెస్ టచ్ లో ఉన్నది. కమ్మ ఓటర్లను ట్రాక్ చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సుమారు 40 వేల ఓట్లు ఉన్నట్లు అంచనా వేశారు.
ఆ రెండు పార్టీలతో ఏం లాభం?
బీజేపీ, బీఆర్ ఎస్ లతో జూబ్లీహిల్స్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ కొట్టిపరేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలున్నా..కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వంటివేమీ రావడం లేదని కాంగ్రెస్ వివరిస్తున్నది. అంతేగాక రాష్ట్రానికి వచ్చే వాటా కూడా నిలిచిపోయినట్లు చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్‌లను కూడా ఆ రెండు పార్టీలే అడ్డుకున్నట్లు పార్టీ ప్రచారం చేస్తున్నది. ఇలాంటి పార్టీలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పబ్లిసిటీ చేస్తున్నది. గడపగడపకు తిరిగి ఆ రెండు పార్టీల మోసాలను వివరించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. డివిజన్ ల వారీగా భారీ స్థాయిలో పోస్టర్లను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
బీజేపీ=బీఆర్ ఎస్: సామా రామ్మోహన్ రెడ్డి
“ బీజేపీ, బీఆర్ ఎస్ వేర్వేరుగా ఎప్పుడూ అనుకోలేదు. ఆ రెండు పార్టీలు ఒక్కటే. పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచి ఆ రెండింటి మధ్య మరింత గట్టి బంధం ఏర్పడింది. బీఆర్ ఎస్ చచ్చి, బీజేపీని తెలంగాణలో బతికించింది. 8 ఎంపీ సీట్లు ఎలా వచ్చాయో? రాష్ట్ర ప్రజలందరికీ సులువుగా అర్ధమైంది. ఇప్పుడ జూబ్లీహిల్స్ లో మోసం చేసేందుకు రెడీ అయ్యాయి. ప్రజలెవ్వరూ ఆ రెండు పార్టీలను నమ్మొద్దు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి బీఆర్ఎస్సే అని స్పష్టంగా తెలుస్తుంది. కారు గుర్తుకి ఓటు కమల బలోపేతానికే అని తేలింది. అయితే ఈ విషయాన్ని గమనించి దిక్కుతోచని స్థితిలో బీజేపీ కార్యకర్తలు ఉండగా, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు డైలమాలో పడ్డారు”.
Read Also- Shocking Incident: రైలులో సీటు ఇవ్వలేదని.. పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. వీడియో వైరల్
