CM-Revanth-Reddy (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Revanth Serious: జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ సీరియస్!.. కారణం ఏంటో తెలుసా?

Revanth Serious: జీహెచ్ఎంసీ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి అక్షింతలు!

వస్తున్నారు.. చెబుతున్నారు.. వెళ్తున్నారంటూ కామెంట్
శంకుస్థాపన చేసి పది నెలలైనా ఒక్కటీ మొదలు పెట్టలేదెందుకంటూ ప్రశ్నలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ ఫలితంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నుంచి వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు హెచ్-సిటీ ప్రాజెక్టును ప్రబుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సిగ్నల్ రహితమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చే ఈ ప్రాజెక్టుకు నిధులగ మంజూరు చేసినా పనులు ముందుకు సాగకపోవటంపై సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీర్లపై సీరియస్ (Revanth Serious) అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల సీఎం వద్ద జరిగిన సిటీ ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో సీఎం తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది డిసెంబర్‌లో శంకుస్థాపన చేసి మళ్లీ ఏడాది పూర్తయినా, హెచ్ సిటీ పనుల్లో కనీసం ఒక్క ప్రాజెక్టు పని కూడా మొదలు కాకపోవటంపై సీఎం మండిపడినట్లు తెలిసింది.

జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం ఇంజనీర్లు సీఎం వద్దకు వెళ్లగానే ‘మీరు వస్తున్నారు, ఏదో చెబుతున్నారు, వెళ్తున్నారు. గానీ క్షేత్ర స్థాయిలో ఒక్క ప్రాజెక్టు పని కూడా ప్రారంభం కావటం లేదు’ అని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇటీవలే హెచ్ఎండీఏ ప్రతిపాదించిన సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ వరకు నిర్మించాల్సిన ఎలివెటేడ్ కారిడార్ పనులను ఆ విభాగం ప్రారంభించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ‘మీరు మాటలు చెబుతున్నారే గానీ, పనులెప్పుడు ప్రారంభిస్తారు’ అని ఇంజనీర్లపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. రూ. 7,038 కోట్ల వ్యయంతో 5 ప్యాకేజీలుగా మొత్తం 23 పనులకు సర్కారు మంజూరు చేయడంతో పాటు అంచనా వ్యయానికి పరిపాలనపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. అయినా, పనులు ఎందుకు మొదలు పెట్టడం లేదని సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టాల్సిన ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఆరు అండర్ పాస్‌ల పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సీఎంకు ఇంజనీర్లు వివరించగా, ఎన్ని రోజుల నుంచి చెబుతున్నారు? ఇంకా పనులు మొదలు కాలేదని సీఎం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Read Also- Mahabubabad Shocking: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బతికుండగానే మార్చురీకి పేషెంట్.. రాత్రంతా శవాల మధ్యనే

జంట పదవులే కారణమా?

జీహెచ్ఎంసీ పరిధిలో హెచ్ సిటీ పనులకు దాదాపు ఏడాది క్రితం సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పాటు అంచనా వ్యయానికి నిధులను కూడా మంజూరు చేసినా హెచ్ సిటీ పనులకు రకరకాల అడ్డంకులేర్పడుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టు విభాగాన్ని పర్యవేక్షించే చీఫ్ ఇంజనీర్ అదనంగా పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కూడా విధులు నిర్వహిస్తున్నందున ఆయన ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయటం లేదన్న విమర్శలున్నాయి. జంట పదవులే ప్రాజెక్టులు ముందుకు సాగకపోవటానికి ప్రధాన కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు ఇంజనీర్ ఎక్కవ సమయం పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పోస్టుకే కేటాయిస్తూ, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ సీట్ లోకి ఆయన అపుడపుడు దర్శనమిస్తుంటారని, ఆయన అలసత్వం కారణంగానే జీహెచ్ఎంసీ హెచ్ సిటీ పనులు ముందుకెళ్లటం లేదన్న వాదనలు సైతం ఉన్నాయి.

Read Also- Yash Toxic: యష్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఇదే.. ఆ రూమర్స్‌కు చెక్!

ఫలితమివ్వని వరుస సమీక్షలు

హెచ్ సిటీ పనుల్లో వేగం పెంచేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రతి మంగళవారం ప్రాజెక్టులపై, బుధవారం ప్రాజెక్టుల మెయింటనెన్స్ పై వరుసగా సమీక్షలు నిర్వహించినా, ఆశించిన ఫలితం దక్కలేదు. హెచ్ సిటీ పనులను ప్రతిపాదించిన ప్రాంతాల్లో కమిషనర్ ఫీల్డు లెవల్ విజిట్ లు నిర్వహించినా పనులు ఏ మాత్రం ముందుకు సాగటం లేదు. స్థల సేకరణ, టౌన్ ప్లానింగ్ విభాగాల మధ్య నెలకున్న సమన్వయం లోపం కారణంగానే పనులు ముందుకు సాగటం లేదన్న వాదనలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టుల విభాగంలోని ఇంజనీర్లు, అధికారుల అలసత్వానికి చెక్ పెట్టేలా కమిషనర్ హెచ్ సిటీ పనుల పర్యవేక్షణ బాధ్యతలను జోనల్ కమిషనర్లకు అప్పగించినా, పనులు ముందుకు సాగకపోవటంతో హెచ్ సిటీ పనులెలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై కమిషనర్ కర్ణన్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రస్తుతం ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ బాధ్యతలను వేరే వారికి అప్పగించేలా చర్యలు తీసుకునే అవకాశాలు సైతం లేకపోలేవన్న చర్చ జరుగుతుంది.

Just In

01

OTT Platforms: ఓటీటీల స్కెచ్ ఇదేనా.. ఇలా అయితే థియేటర్స్ మూతే!

Rage Of Kaantha: రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ ఎలా ఉందంటే?

Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?

Naveen Yadav: నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఫిర్యాదు

Biker: ‘బైకర్’ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ వస్తుంది కానీ.. చిన్న ట్విస్ట్.. ఏంటంటే?