CM Revanth Reddy (Image Source: Twitter)
Telangana News

CM Revanth Reddy: మహిళలకు సీఎం గుడ్ న్యూస్.. అమెజాన్‌తో సంప్రదింపులు.. డీల్ కుదిరితే డబ్బే డబ్బు!

CM Revanth Reddy: తెలంగాణ వ్యాప్తంగా మ‌హిళా సంఘాలు ఉత్ప‌త్తి చేస్తున్న వివిధ వ‌స్తువులను ఈ కామర్స్ ద్వారా అంత‌ర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాన‌మంత్రి ఇందిరాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్ర‌హానికి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డ ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌ల పంపిణీని ప్రారంభించారు. అనంత‌రం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి జిల్లాల్లోని మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల (ఎస్‌హెచ్‌సీ) స‌భ్యుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు.

పండుగలా చీరల పంపిణీ

తెలంగాణ‌లోని ఆడ బిడ్డ‌ల‌కు పుట్టింటి వాళ్లు.. అన్న‌ద‌మ్ములు సారె చీరె పెట్ట‌డం సాంప్ర‌దాయ‌మ‌ని… అలాగే రాష్ట్రంలోని ప్ర‌తి ఆడ‌బిడ్డ‌ను తోబుట్టువుగా భావించి త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం అర్హులైన ప్ర‌తి మ‌హిళ‌కు చీర అందిస్తుంద‌ని సీఎం అన్నారు. తెలంగాణ‌లోని అర్హులైన కోటి మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీఎం తెలిపారు. ఇందిరా మ‌హిళా శ‌క్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మ‌హిళా ఉన్న‌తి.. తెలంగాణ ప్ర‌గ‌తి పేరిట చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాలన్నారు. ప్ర‌తి మండ‌ల కేంద్రంలో ఈ కార్య‌క్ర‌మాన్ని పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించాల‌ని… ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని సీఎం సూచించారు.

అర్హులైన ప్రతీ మహిళకు చీర

న‌వంబ‌రు 19 నుంచి డిసెంబ‌రు 9 వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఏళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు చీర‌ల పంపిణీ పూర్తి చేయాల‌ని.. ఇందుకు రూ.65 ల‌క్ష‌లు అందుబాటులో ఉంచామ‌ని సీఎం తెలిపారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8వ తేదీ వ‌ర‌కు 35 ల‌క్ష‌లు చీర‌లు పంపిణీ చేయాల‌ని సీఎం ఆదేశించారు. అర్హులైన ప్ర‌తి మ‌హిళ‌కు చీర అందుతుంద‌ని… ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టిన సామాజ‌క, ఆర్థిక‌, విద్యా, ఉపాధి, రాజ‌కీయ‌ కుల స‌ర్వే (సీపెక్‌) డాటాను ద‌గ్గ‌ర పెట్టుకొని ప్ర‌తి మ‌హిళ‌కు చీర అందెలా చూడాల‌ని.. చీర అందించే స‌మ‌యంలో ఆధార్‌ను తీసుకోవాల‌ని.. ముఖ గుర్తింపు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సీఎం సూచించారు.

అవ‌కాశం ఉన్న‌చోట‌ల్లా ప్రోత్సాహం..

మ‌హిళ‌ల ఉన్న‌తే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం వ‌డ్డీలేని రుణాల విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని… తాము వ‌డ్డీలేని రుణాలు ఇవ్వ‌డంతో పాటు అందుకు సంబంధించిన నిధులు విడుద‌ల చేసిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించ‌డ‌మే కాకుండా ఆర్టీసీ బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జమానుల‌ను చేశామ‌ని సీఎం తెలిపారు. యూనిఫాంలు కుట్టే బాధ్య‌త‌ను అప్ప‌జెప్ప‌డంతో మ‌హిళా సంఘాల‌కు రూ.30 కోట్ల ఆదాయం స‌మ‌కూరింద‌ని అన్నారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల క‌మిటీల ద్వారా పాఠ‌శాలల్లో రూ.534 కోట్ల ప‌నులు చేప‌ట్టామ‌ని, ధాన్యం కొనుగోళ్లు మ‌హిళా సంఘాల‌కే అప్ప‌జెప్పామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అమెజాన్‌తో సంప్రదింపులు..

శిల్పారామం ప‌క్క‌న రూ.వంద‌ల కోట్ల విలువైన 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామ‌ని సీఎం రేవంత్ గుర్తుచేశారు. మ‌హిళా సంఘాలు ఉత్ప‌త్తి చేస్తున్న ఉత్ప‌త్తుల‌కు అంత‌ర్జాతీయ మార్కెట్ క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ మ‌హిళ‌ల గౌర‌వం పెంచాల‌నే ఉద్దేశంతోనే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌డుతోంద‌న్నారు. రేష‌న్ కార్డు ఉన్న మ‌హిళ‌లంద‌రికీ చీర‌లు అందిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. మంత్రి సీత‌క్క మాట్లాడుతూ మ‌హిళా సంఘాల ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు సంఘాల ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. 98 శాతం రుణ చెల్లింపుతో సంఘాలు త‌మ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను చాటుతున్నాయ‌ని కొనియాడారు. ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌ల పంపిణీపైనా కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని.. వాటిని తిప్పికొట్టాల‌ని సూచించారు.

Also Read: Nagarkurnool District: ఒరేయ్ అది ఆటోనా లేక స్కూల్ బస్సా.. 23 మందిని ఇరికించేశావ్.. నీకో దండంరా దూత!

మహిళలతో సీఎం చిట్ చాట్

మీ సంఘం ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా న‌డుస్తోంద‌ని నారాయ‌ణ‌పేట జిల్లా మ‌హిళా స‌మాఖ్య అధ్య‌క్షురాలు అధ్య‌క్షురాలు అరుంధ‌తిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అడిగారు. బాగా న‌డుస్తోంద‌ని.. నెల‌కు రూ.4 ల‌క్ష‌ల రాబ‌డి వ‌స్తోంద‌ని ఆమె సీఎంకు తెలియ‌జేశారు. ఇత‌ర జిల్లాల నుంచి సంఘాల‌ను అక్క‌డ‌కు తీసుకెళ్లి వారి ప‌ని తీరు.. రాబ‌డిని ప్ర‌త్య‌క్షంగా చూపాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సీఎం సూచించారు. మరోవైపు త‌మ‌కు ఇస్తున్న చీర‌ల డిజైన్లు ఎంతో బాగున్నాయ‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురాలు భాగ్య.. సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 9 మీట‌ర్లు, 6 మీట‌ర్ల చీర‌లు త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఉన్నాయ‌ని త‌మ‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని తెలియజేశారు. ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌లు ఇవ్వ‌డం ద్వారా త‌మ‌కు యూనిఫాం వ‌చ్చింద‌నే సంతోషం ఉంద‌ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురాలు శ్రీ‌దేవి తెలిపారు.

Also Read: PM Modi – Sri Sathya Sai: తెలుగులో మాట్లాడిన మోదీ.. అవాక్కైన చంద్రబాబు, పవన్.. చప్పట్లతో మార్మోగిన సభ!

Just In

01

Chikoti Praveen: నీ పతనం ఖాయం.. రాజమౌళిపై చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. గ్యాస్ రీఫిల్లింగ్ దందాపై.. అధికారుల పంజా

Ibomma Ravi: ఐబొమ్మ రవిపై సినిమా.. వీడెవడో మరో వర్మలా ఉన్నాడే!

CM Revanth Reddy: మహిళలకు సీఎం గుడ్ న్యూస్.. అమెజాన్‌తో సంప్రదింపులు.. డీల్ కుదిరితే డబ్బే డబ్బు!

Bigg Boss Telugu 9: హౌస్‌మేట్స్‌ని ఏడిపిస్తున్న బిగ్ బాస్.. రీతూపై పవన్ ఫ్యామిలీ ప్రేమ చూశారా?