PM Modi – Sri Sathya Sai: పుట్టపుర్తిలో జరిగిన సత్యసాయి జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవలను గుర్తుచేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రసంగం ప్రారంభంలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడటం అందరినీ షాక్ కు గురిచేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా వేదికపై ఉన్నవారంతా తెలుగులో మోదీ ప్రసంగాన్ని ప్రారంభించడం చూసి అవాక్కయ్యారు. మరోవైపు జయంతి వేడుకల్లో పాల్గొన్నవారంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టి మోదీని అభినందించారు. దీంతో హర్షధ్వానాల మధ్య సభ మార్మోగింది.
తెలుగులో ఏమన్నారంటే?
సత్యసాయి జయంతి ఉత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తాన్ని ఆరంభిస్తూ ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు’ అని తెలుగులో అన్నారు. విశ్వప్రేమకు ప్రతీరూపంగా సత్యసాయి జీవించారని గుర్తుచేశారు. భౌతికంగా సత్యసాయి మనతో లేకున్నా.. ఆయన ప్రేమ ఎప్పటికే మన వెంటే ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు సత్యసాయి బోధలన ప్రభావం దేశమంతా కనిపిస్తోందన్న మోదీ.. ఆయన్ను పూజించే కోట్లాది మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని కొనియాడారు.
https://twitter.com/bigtvtelugu/status/1991049690541142317
పుట్టపర్తి.. పవిత్ర భూమి: మోదీ
సత్యసాయి చేసిన బోదనలు లక్షలాది మందిని సన్మార్గంలోకి నడిపించాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ నినాదం చాలా మంది జీవితాలను మార్చివేశాయని పేర్కొన్నారు. విద్య, వైద్యం, తాగునీరు తదితర ఎన్నో సేవా కార్యక్రమాలను సత్యసాయి చేశారని మోదీ గుర్తుచేశారు. పుట్టపర్తి చాలా పవిత్ర భూమి అన్న ప్రధాని.. ఈ నేలలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సత్యసాయి స్మారకార్థంగా రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను సైతం ప్రధాని మోదీ ఆవిష్కరించడం విశేషం.
Also Read: CM Revanth Reddy: ఇందిరమ్మ జయంతి స్పెషల్.. కోటి చీరల పంపిణీపై.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
మోదీకి ఘన స్వాగతం
అంతకుముందు జయంతి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయంలో దిగిన మోదీకి.. పుష్పగుచ్చం అందించి ఇరువురు నేతలు స్వాగతం పలికారు. అనంతరం సాయి కుల్వంత్ హాల్ లోని సత్యసాయి సమాధిని ప్రధాని మోదీ సందర్శించారు. ప్రార్ధనా మందిరాన్ని చంద్రబాబు, పవన్ లతో కలిసి మోదీ పరిశీలించారు.
