CM Revanth Reddy( IMAGE CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

CM Revanth Reddy: ఈ నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం కట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖలు

CM Revanth Reddy: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కొన్ని దుష్ట శక్తులు కావాలనే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి  (CM Revanth Reddy) ప్రతిపక్షాలపై విమర్శలు వర్షం కురిపించారు. ఆయన గ్రూప్-1 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ…పదేళ్లుగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిదనేది స్పష్టమవుతుందన్నారు.

అమర వీరులు యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ల త్యాగాలను కేసీఆర్ అపహాస్యం చేశారన్నారు. గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా నియమించారన్నారు. ఫలితంగా ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ లో కనిపించాయన్నారు. దీంతోనే తాము అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామన్నారు. పరీక్షలు నిర్వహిస్తే కొంత మందికి నచ్చలేదన్నారు. కడుపునిండా విషం పెట్టుకుని మిమ్మల్ని ఎన్నిరకాలుగా అడ్డుకోవాలని చూశారన్నారు.

తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగుల జీతాల్లోంచి పది శాతం కట్

రూ. 2 కోట్లు, రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చామని ఆరోపించారన్నారు. అయినా నిరుద్యోగుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని చాలా ఓపికతో వ్యవహరించామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కేసులు వేసినా, తప్పుడు ప్రచారం చేసినా ఓపికతో దిగమింగామన్నారు. అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు తనకు నిరుద్యోగుల భవిష్యత్ మాత్రమే కనిపించిందని సీఎం భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసే బాధ్యత కొత్తగా కొలువులు తీసుకున్న వారి చేతిల్లోనే ఉన్నదన్నారు.

 Also Read: KTR: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మూసీకి వరదలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మనమంతా దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దాం

నవ్విన వాడి ముందు జారిపడ్డట్లు వ్యవహరించవద్దని, ఒక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. మనమంతా దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దామన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు అంతా సహకరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్ గా నిలవాలన్నారు. భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే నని వివరించారు. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగుల జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తామని సీఎం నొక్కి చెప్పారు.

 తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర

ఇక కొంతమంది అప్పుడప్పుడు తెలంగాణ ఎక్కడున్నది? ఎక్కడ ఉంటదని నిత్యం విమర్శలు చేస్తున్నారని, తెలంగాణ ఎక్కడికి పోదని సీఎం క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ స్ఫూర్తి, చైతన్యమే తమ ప్రభుత్వాన్నిముందుకు నడిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయని, తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర, పౌరుషం ఉన్నాయన్నారు. ఏ మారుమూల పల్లెకు, గూడెంకు వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. కానీ కొంత మంది కారణజన్ములమని, వారి కుటుంబమే తెలంగాణ అని భావించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు వారికి నమ్మి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకద్రోహం చేశారన్నారు. నమ్మకద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారన్నారు.

అనేక సవాళ్లున్నా..తెలంగాణ రైజింగ్ కు కృషి: డిప్యూటీ సీఎం..

అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికిని రాష్ట్రాన్ని అజేయంగా నిలబడటానికి, తెలంగాణ రెపరెపలాడటానికి రైజింగ్ రావడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాదులో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం 40 ఏళ్ల పాటు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నియామకాలు జరిగిన దాఖలాలు లేవని తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 562 మందికి ఏకకాలంలో నియామక పత్రాలు అందజేయడం ఎంతో గర్వకారణం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం నిరుద్యోగ యువత ఉరికంబాలు ఎక్కార ని, అగ్నికి ఆహుతి అయ్యారని, నాడు యువత చేసిన పోరాటం త్యాగాలను చూసి పార్లమెంట్లో బలం లేకున్నప్పటికిని సోనియాగాంధీ అన్ని పార్టీలను కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. 

 Also Read: Suhas Family: మరో బిడ్డకు జన్మనిచ్చిన సుహాస్ భార్య.. ఫ్యామిలీలో సంతోషం

Just In

01

Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి

Election Commission: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ అబ్జర్వర్ల నియామకం

Flipkart offer: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. ఆ ఫోన్ కొంటే స్మార్ట్ టీవీ ఫ్రీ.. వివరాలు ఇవే..

Upasana: ఢిల్లీ సీఏం రేఖా గుప్తాతో బతుకమ్మ ఆట.. ఉపాసన రేంజ్ చూశారా?

Bathukamma Flowers: బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెసుసా?