Suhas Family: హీరో సుహాస్ ఫ్యామిలీ ఇంకాస్త పెద్దదైంది. వారి ఫ్యామిలీలోకి మరో బుడతడు చేరాడు. ప్రస్తుతం వారి ఫ్యామిలీ అంతా ఆనందంతో నిండిపోయింది. సుహాస్ (Hero Suhas) భార్య నాగ లలిత (Naga Lalitha) మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు సుహాస్ వ్యక్తిగత జీవితంలో మరో శుభవార్త చోటుచేసుకుంది. సుహాస్, భార్య లలిత దంపతులకు రెండోసారి మగబిడ్డ జన్మించారు. ఈ సంతోషకరమైన విషయాన్ని స్వయంగా సుహాస్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ఓ ఫొటోని కూడా షేర్ చేశారు. ఇప్పుడా ఫొటో వైరల్ అవుతుండగా, టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మళ్లీ అబ్బాయి పుట్టాడు
‘మళ్లీ అబ్బాయి పుట్టాడు’ అని సుహాస్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ‘మీ కుటుంబలో వచ్చిన ఈ కొత్త ఆనందానికి, మీ చిన్నారికి, మీకు అభినందనలు’ అంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ దంపతులకు తొలి సంతానంగా ఒక బాబు ఉన్న విషయం తెలిసిందే. 2024 జనవరిలో తమ మొదటి కుమారుడు జన్మించిన సందర్భంగా సుహాస్ ‘ప్రొడక్షన్ నెం. 1’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌తో ఆనందాన్ని పంచుకున్నారు. కేవలం కొంతకాలంలోనే రెండోసారి తండ్రి కావడం పట్ల సుహాస్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సందీప్ కిషన్, సందీప్ రాజ్, యాంకర్ ప్రత్యూష వంటి వారంతా సుహాస్ పోస్ట్‌కు రిప్లయ్ ఇస్తూ.. లవ్ ఈమోజీలను పోస్ట్ చేశారు.
Also Read- Lokah Chapter 2: ‘కొత్త లోక చాప్టర్ 2’పై అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో!
నటనలో బిజీగా సుహాస్
సినిమాల విషయానికి వస్తే, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుహాస్. ముఖ్యంగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’లో ఆయన ప్రదర్శించిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆయన చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘ప్రసన్నవదనం’ చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్న సుహాస్, ఒక వైపు హీరోగా చేస్తూనే, మధ్యమధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘ఓజీ’ సినిమాలోనూ ఆయన ఓ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న సుహాస్‌కు, రెండో కుమారుడి జననం ఆయన సంతోషాన్ని రెట్టింపు చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఈ చిన్నారికి ఏ పేరు పెడతారో? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు