- ఇక నుంచి ప్రభుత్వ పాలన స్పీడప్
- పక్షం రోజులకోసారి ఫర్మామెన్స్ షీట్
- మంత్రులతో ముఖ్యమంత్రి రివ్యూలు
- వీక్లీ రిపోర్టులతో పాలన పరుగులు
- స్థానిక ఎన్నికల ముందు కీలక నిర్ణయం
- పాలసీలు, నిర్ణయాలు, స్కీమ్‌లపై చర్చ
Telangana: ఇక నుంచి ప్రభుత్వ పాలనను స్పీడప్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భావిస్తున్నారు. అందుకోసం పదిహేను రోజులకోసారి ఫర్మామెన్స్ షీట్స్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రే నేరుగా మంత్రులతో రివ్యూ (Review) చేయనున్నారు. ఇంటెలిజెన్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సోర్సెస్ ద్వారా చేరిన వీక్లీ రిపోర్టులు ( Weekly Reports) ఆధారంగా సమీక్షలు చేయనున్నారు. అన్ని శాఖల్లోని పరిస్థితులను సీఎం నేరుగా మానిటరింగ్ చేయనున్నారు. పాలసీలు, నిర్ణయాలు, సర్కార్ స్కీమ్‌లపై చర్చించనున్నారు. దాని ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు సీఎం తీసుకున్న నిర్ణయం ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలోనూ చర్చంశనీయమైంది. క్యాబినెట్ (Cabinet) విస్తరణ, కార్యవర్గం ఈ నెలలోనే ఉంటాయని ఏఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ లోపే సీఎం ఫర్మామెన్స్ రివ్యూస్ అంటూ మంత్రులకు చెప్పడంతో ఉత్కంఠ నెలకొన్నది.
Read Also- Konda Surekha: రాజన్న కోడెలపై రాజకీయం వద్దు.. మంత్రి సంచలన కామెంట్స్!
అర్బన్, రూరల్ రిపోర్ట్స్
ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలోకి చేరుతున్నాయా, ప్రజలు ఏ మనుకుంటున్నారు, ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు, ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి, వాళ్ల పనితీరు ఎలా ఉన్నది, జనాలకు ఇంకా ఏం చేద్దామనే అంశాలపై సర్కార్ స్టడీ చేయనున్నది. ప్రతివారం ఈ అంశాలన్నింటిపై ఎప్పటికప్పుడు రిపోర్టు అందజేసేలా ఇప్పటికే సీఎంవో నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. వివిధ శాఖల అధికారులు సమన్వయమై ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయనున్నట్లు తెలిసింది. ఇక సర్వే నిర్వహించేందుకు కూడా సర్కార్ ప్రణాళికను తయారు చేస్తున్నది.
Read Also- Crowd at Ration Shops: మూడు నెలల బియ్యానికి.. ముప్పు తిప్పలు!
సమస్యలు పరిష్కారమే మార్గం
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక మీటింగ్‌లలో సమస్యలు, పరిష్కారాలే ప్రధాన ఏజెండాగా నిర్వహించనున్నారు. క్యాబినెట్ తరహాలోనే ఈ మీటింగ్‌లు ఉంటాయని సీఎంవోలోని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 17సార్లు క్యాబినెట్ మీటింగ్‌లు జరిగాయి. రెండు మూడు నెలలకోసారి ఈ మీటింగ్ జరుగుతున్నది. దీంతో ఇష్యూస్ ప్రోలాంగ్ అవుతున్నాయనే అభిప్రాయంలో సర్కార్ ఉన్నది. దీంతో క్యాబినెట్ తరహాలోనే రివ్యూస్ ఏర్పాటు చేసి, సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సీఎం తన వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు.
Read Also- Arrest Virat Kohli: విరాట్ కోహ్లీకి ఊహించని పరిణామం.. అల్లు అర్జున్ ఫొటోలు వైరల్