CM Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ

CM Revanth Reddy: చిన్నారికి కొండంత కష్టం.. రంగంలోకి సీఎం.. కీలక ఆదేశాలు జారీ

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారికీ ఉచితంగా సర్జరీ చేయించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం (Telangana CMO) ఎక్స్ వేదికగా తెలియజేసింది. ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి (Government ENT Hospital)లో పూర్తిగా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ (Cochlear Implant Surgery) చేయించాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అధికారులకు సూచించినట్లు పేర్కొంది.

వివరాల్లోకి వెళ్తే..
నాలుగేళ్ల నేతావత్ లిఖితా శ్రీ (Likhita Sri)కి వినికిడి లోపం శాపంగా మారింది. నలుగురు పిల్లలతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన ఆ పాప.. ఎవరు ఏం చెబుతున్నారో వినపడక ఉక్కిరి బిక్కిరి అయ్యేది. ఏం మాట్లాడినా అమాయకంగా చూస్తూ ఉండిపోయేది. ఇది గమనించిన తల్లిదండ్రులు.. వైద్యులను సంప్రదించగా.. వినికిడి లోపం ఉన్నట్లు తేల్చారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తప్పనిసరి అని సూచించారు.

Also Read: Gold Rate ( 07-06-2025) : మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అతి భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్

సీఎం సాయం
అయితే సర్జరీకి భారీ మెుత్తంలో డబ్బు అవసరం అవ్వనుండటంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం.. పాపకు అవసరమైన వైద్యం ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చికిత్స జరిగి లిఖిత పూర్తిగా కోలుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది.

Also Read This: Congress Leader: రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత.. మహిళా ఎస్సైపైనే దాడి.. వీడియో వైరల్

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?