CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఉమ్మడి లక్ష్యాలను పంచుకుంటూ వారితో కీలక చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit0లో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు.
విజన్ డాక్యుమెంట్
తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధిని లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి అగ్రనేతలకు ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్ట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
Also Read: Akhanda Promotion: బాలయ్య ‘అఖండ 2 తాండవం’ ప్రచారంలో వేరే లెవెల్.. ఇది వర్తే మామా..

