CM Revanth Reddy( image credit: swetcha reporter)
తెలంగాణ

CM Revanth Reddy: ఎకో టౌన్ మోడల్ తో సీఎం ప్రేరణ.. ముసీ నదీ పునరుజ్జీవనంపై ఫోకస్!

CM Revanth Reddy: తెలంగాణ, కిటక్యూషు నగరం మధ్య ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ ఐటీసీ కాకతీయ లో జపాన్​ లోని కిటాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిస పరస్పర సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఏప్రిల్‌లో తాను జపాన్‌ను సందర్శించినప్పుడు అక్కడి అభివృద్ధిని, వర్క్ ను చూశానన్నారు. కిటాక్యూషు నగరం  ఎకో-టౌన్ మోడల్ తో చాలా ప్రేరణ పొందానని వివరించారు. ఆ ప్రేరణతోనే హైదరాబాద్ లో అలాంటి డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. అందుకే జపనీస్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

Also Read: Anushka Shetty: రెండేళ్ల తర్వాత స్వీటీ.. ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ ఒప్పందం సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణలలో సహకారానికి పునాది కానున్నదన్నారు. మూసీ నది అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపై తమ దృష్టి ఉన్నదన్నారు. తెలంగాణ యువతకు నైపుణ్యం కల్పించడమే తమ లక్ష్యం అన్నారు. జపాన్ లో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఇక్కడి విద్యార్ధులు జపనీస్ బాషను నేర్చుకోవాలని కూడా తాపత్రయం పడుతున్నట్లు సీఎం గుర్తు చేశారు.

హైదరాబాద్,కిటాక్యూషు మధ్య  విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నాలు చేస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎం స్పైషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ,స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి ,ఎంపీ లు చామల కిరణ్ ,అనిల్ కుమార్ యాదవ్,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Raja Singh Threat: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రాణాలకు ముప్పు.. వరుసగా బెదిరింపు కాల్స్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!