CM Revanth on BRS( image credit: twitter)
తెలంగాణ

CM Revanth on BRS: బీఆర్ఎస్ పాలన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది.. సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth on BRS: పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్​ ఆర్థిక విధ్వంసం సృష్టించింది…ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఉద్యోగుల సమరం అని వార్తలొస్తున్నాయంటూ ఎవరిపై యుద్ధం? ప్రజల పైనా? అని ప్రశ్నించారు. ఇప్పటికే గడ్డు పరిస్థితుల్లోఉన్నాం. ఇప్పుడు సమ్మెలు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని చెప్పారు.

ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా చర్చించాలన్నారు. వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్​ కంట్రోల్​ లో సోమవారం జరిగిన రియల్ హీరోస్​ అవార్డ్స్​ కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి ముఖ్య అతిధిగాపాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు అప్పులపై నెలకు 5 నుంచి 6 వందల కోట్లు మాత్రమే కట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.

 Also Read: Drinking water: తాగునీటి సమస్యలపై తక్షణ స్పందన అవసరం.. సీఎస్ అధికారులకు ఆదేశాలు!

అయితే, బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పులతో ప్రస్తుతం నెలకు అసలు…వడ్డీలు చెల్లించటానికే నెలకు 7వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తోందన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వటంతోపాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే నెలకు 22వేల 500 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కావాలన్నారు. అయితే, వస్తున్న ఆదాయం 18వేల నుంచి 18వేల 500 కోట్లు దాటటం లేదన్నారు. అయినా, ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్​ తారీఖున జీతాలు చెల్లిస్తున్నట్టు చెప్పారు.

సంక్షేమ పథకాలైన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, 500 రూపాయలకే గ్యాస్​ సిలిండర్, ఉచిత విద్యుత్తు, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యంపై 500 రూపాయల బోనస్​ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం 7వేల 625కోట్ల రూపాయల రైతుబంధు బకాయిలు పెట్టి పోతే తమ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లించామన్నారు. రైతులకు 20వేల కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ చేశామని చెప్పారు.బీఆర్​ఎస్​ ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అమ్మిందని, తమ ప్రభుత్వం వచ్చాక ఒక్క గుంట భూమిని కూడా విక్రయించలేదన్నారు.

 Also Read: Ponnam Prabhakar: ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం.. మంత్రి ప్రకటన!

ప్రభుత్వానికి నెలకు వస్తున్న ఆదాయం 18వేల 500 కోట్లు మాత్రమేనని, నిజానికి కావాల్సింది 22వేల 500 కోట్లని చెప్పారు. జీతభత్యాలు, అప్పులు చెల్లించిన తరువాత చేతిలో మిగులుతున్నవి కేవలం 6వేల కోట్ల రూపాయలే అని తెలిపారు. దీంట్లోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు గుర్తించాలన్నారు. నన్ను కోసినా నెలకు 18వేల 500 కోట్లకు మించి ఆదాయం లేదు…ఎట్లా పంచాలో మీరే చెప్పండి…ఏ పథకాన్ని ఆపమంటారో మీరే సూచించండి అని అన్నారు. కావాలంటే బహిరంగ సభ పెడతా…మీరే ప్రజలకు చెప్పండని ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ధర్నాలు…సమ్మెలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలిపోతుంది…రాష్ట్రం దివాళా తీస్తుందన్నారు. అందుకే ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా..మీ సమస్యలు ఏవైనా ఉంటే ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించండి…నిజాలు తెలుసుకోండి…ఆ తరువాత మీరు ఎట్లా చెబితే అట్లా చేద్దామన్నారు. అలా కాకుండా వీధికెక్కి రచ్చచేస్తే వచ్చే పెట్టుబడులు కూడా ఆగిపోతాయన్నారు. నెలకు వెయ్యి కోట్లు నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 20లక్షల ఎకరాలను సాకులోకి తీసుకు రావచ్చన్నారు.

 Also Read; Transfers In GHMC: జీహెచ్‌ఎంసీ బదిలీలు.. శానిటరీ జవాన్లలో అక్రమార్జన, అవినీతిపై ఆరోపణలు!

అయితే, బీఆర్​ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇదంతా తెలిసి కూడా పెద్దమనిషి ఫార్మ్​ హౌస్​ నుంచి మూడు నెలలకొకసారి బయటకు వచ్చి పట్టరాని సంతోషంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పైశాచిక ఆనందాన్నిపొందుతున్నాడని విమర్శించారు. అందుకే రాజకీయ పార్టీల నేతల చేతుల్లో పావులుగా మారకండి అంటూ ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్​, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను కోరుతున్ననన్నారు.

తెలంగాణ పోలీస్ భేష్​…
శాంతిభద్రతలను పరిరక్షించటంలో తెలంగాణ పోలీసులు దేశం మొత్తం మీద నెంబర్​ వన్​ స్థానంలో నిలబడటం గర్వించదగ్గ విషయమన్నారు. శాంతిభద్రతలు సుస్థిరంగా ఉన్నాయి కాబట్టే తాము అధికారంలో వచ్చిన 16నెలల్లో 2లక్షల 28వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగినట్టు చెప్పారు. రోజుకు 18గంటలు ఎవరైనా పని చేస్తున్నారంటే అది పోలీసులే అని చెప్పారు. ఈ క్రమంలో కుటుంబాలకు కూడా సమయం కేటాయించ లేకపోతున్నారన్నారు. పిల్లల చదువులపై దృష్టిని పెట్టలేక పోతున్నట్టు చెప్పారు. అందుకే మంచిరేవులలో అత్యంత విలువైన 50 ఎకరాల భూమిని కేటాయించి యంగ్​ ఇండియా పోలీస్​ స్కూల్​ ను ప్రారంభించినట్టు తెలిపారు.

హోంగార్డు నుంచి డీజీ వరకు ఎవ్వరైనా తమ పిల్లలను ఈ స్కూల్లో చేర్పించ వచ్చని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న పోలీసు శాఖకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డ్రగ్స్​ ను ఉక్కుపాదంతో అణచి వేయాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు రియల్​ హీరోస్ అవార్డులను ఇచ్చి సంత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్​, డీజీపీ జితేందర్​, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్​ కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?