Drinking water: నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరికి స్వచ్ఛమైన, శుద్ధి చేసిన తాగునీటిని అందించాలన్నారు.
Also Read: Transfers In GHMC: జీహెచ్‌ఎంసీ బదిలీలు.. శానిటరీ జవాన్లలో అక్రమార్జన, అవినీతిపై ఆరోపణలు!
సమస్మాత్మక గ్రామాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడాలు, లంబాడీ తండాలు అధికంగా ఉండే ఆదిలాబాద్, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి తదితర జిల్లాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జలాశయాల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. మిషన్ భగీరథ ఇంజనీర్లు, పబ్లిక్ హెల్, మున్సిపాలిటీ ఇంజనీర్లు సమన్వయంతో పనిచేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు.
జిల్లా కలెక్టర్ తమ జిల్లాల్లో తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు లోకేష్ కుమార్, కృపాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు