CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం
CM Revanth Reddy (imagecredit:twitter)
Telangana News

CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు సమ్మక్క, సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఓప్రత్యేక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలి వచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం

చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని ప్రజా ప్రభుత్వం పునర్నిర్మించిందని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. రూ.250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, ప్రాంగణానికి నలు దిశలా తోరణాలను నిర్మించినట్లు గుర్తు చేశారు. లక్షలాదిగా నిరంతరం మేడారం తరలివస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు, ఆదివాసీల ఆచారాలను పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని అన్నారు.

Also Read: Medchal District: మున్సిపాలిటీ ఎన్నికలకు మోగిన నగారా.. నామినేషన్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

వనదేవతల దీవెనలను గుర్తు

మేడారం తల్లుల స్పూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వనదేవతల దీవెనలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తల్లుల చెంత ప్రజా ప్రభుత్వం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించిందని అన్నారు. జనంకోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల స్ఫూర్తిగా రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని అన్నారు.నాలుగు రోజుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

 ప్రణాళిక ప్రకారం

కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే అంచనాలు ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం ఫోన్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో వన దేవతలను దర్శనం చేసుకొని.. మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించాలని అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా భక్తులు సహకరించాలని కోరారు. పోలీసు విభాగంతో పాటు అన్ని విభాగాల అధికారులు కలిసికట్టుగా మహా జాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల అధికారులు నాలుగు రోజుల పాటు నిర్విరామంగా భక్తులకు అందుబాటులో ఉండాలని అప్రమత్తం చేశారు.

AlsoRead: Ajit Pawar Dies: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం.. డిప్యూటీ సీఎం దుర్మరణం

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?