CM Revanth Reddy: కేసీఆర్ గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వం
CM Revanth Reddy (imagecredit:twitter)
Telangana News

CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వం: సీఎం రేవంత్

CM Revanth Reddy: జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి సోర్స్ శ్రీశైలానికి మార్చడానికి కేసీఆర్ మంత్రి వర్గ ఆమోదం తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ప్రజా భవన్‌లో తెలంగాణ నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసలు విషయాలు వెలుగులోకి వస్తాయనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఈ అంశం పైన ప్రభుత్వం విచారణ జరుపుతుందన్నారు. అందుకే హరీశ్ రావు డైవర్షన్ కోసం బనకచర్లపై మాట్లాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వమని స్పష్టం చేశారు. కేసీఆర్ తన అనుభవాన్ని సభలో పంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ఆ సంతకాలతో వందేళ్ల నష్టం

కేసీఆర్, హరీశ్ రావు పదేళ్లలో తెలంగాణకు నీళ్ల విషయంలో వందేళ్ల నష్టం చేశారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్‌కు శాశ్వత జల, రాజకీయ సమాధి కడతారనే విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్, హరీశ్ రావును నీళ్ల విషయంలో ఉరి తీసినా తప్పు లేదన్నారు. ఆదిత్య నాథ్ దాస్‌ను సలహాదారుగా నియమించడం పైన విమర్శలు చేస్తున్నారని, ఆయన తెలంగాణ ప్రాజెక్టుల పైన పదేళ్లు పని చేసినట్లు గుర్తు చేశారు. అన్ని ప్రాజెక్టుల పైన పూర్తి అవగాహన ఉన్నదన్నారు. ఆయన తనకు బంధువు కాదని స్పష్టం చేశారు. వారి దొంగతనం బయట పడుతుందనే ఆదిత్య నాథ్ దాస్ పైన హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నదీ జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజుకు 18 గంటలు పని చేస్తున్నారని, ప్రతి కాగితాన్ని అధ్యయనం చేసి తెలంగాణ తరుఫున వాదిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

Also Read: Minor Irrigation Census: మైనర్ ఇరిగేషన్ పై కేంద్రం స్పెషల్ ఫోకస్.. బోరు బావులకు మీటర్లు?

299 టీఎంసీల కోసం సంతకం

నదీ జలాల విషయంలో తప్పులు చేయడం వలనే ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారన్నారు. సంకుచిత స్వభావంతో ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తునట్లు మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిందే నీటి హక్కుల కోసమని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి హక్కుల కోసం సొంత పార్టీని కాంగ్రెస్ నాయకులు ఎదిరించారన్నారు. తెలంగాణకు కావాల్సిన నీటి హక్కుల కోసం అన్యాయాన్ని సరిదిద్దడం కోసం పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యాక నీటి పంపకాలు జరిగాయని, నికర జలాలలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 511 టీఎంసీల పంపకానికి ఒప్పుకుంటూ కేసీఆర్ సంతకం చేశారన్నారు. ఏపీకి కృష్ణా జలాల్లో శాశ్వత హక్కులు కల్పిస్తూ అవకాశం ఇచ్చారని చెప్పారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను ఏపీ ముందుకు పోనివ్వడం లేదన్నారు. పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 79 శాతం, ఏపీకి 21 శాతం వాటా ఇవ్వాలని తాము వాదిస్తున్నామని చెప్పారు. తెలంగాణకు మొత్తం 555 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తమ వాదనతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని, తెలంగాణ సమర్ధ వాదనలు వినిపిస్తున్నదని ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ లేఖ రాశారని గుర్తు చేశారు.

కమీషన్ల కక్కుర్తి వల్లే..

అన్ని ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ మనుగడ కష్టం అని కేసీఆర్ బయటకు వచ్చారని సీఎం విమర్శించారు. నీళ్ల పైన వివాదం సృష్టించి రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. ఏపీకి సహకరిస్తున్నారనే అపోహ సృష్టించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పైరయ్యారు. కేసీఆర్, హరీశ్ రావు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడం వెనుక కమీషన్ల కక్కుర్తి ఉన్నదన్నారు. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడం వల్ల 3 స్టేజ్‌లు, 5 స్టేజ్‌లకు, 22 పంపులు రూ.32 వేల కోట్ల అంచనాలు రూ.84 వేల కోట్లకు చేరాయన్నారు. తల వద్ద కాకుండా తోక దగ్గర నీళ్లు తీసుకొన్నారని మండిపడ్డారు. ఏపీ ప్రతి రోజు 13.37 టీఎంసీలు తరలించుకునేలా ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకున్నారన్నారు. తెలంగాణ మాత్రం ప్రతి రోజు 0.25 టీఎంసీ కూడా తీసుకోలేక పోతున్నదని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం 7.15 టీఎంసీలకు అనుమతి తీసుకొచ్చిందన్నారు. పంపులు, లిఫ్ట్ కాంట్రాక్టర్ల బిల్లుల కోసం ఈ అనుమతి తెచ్చిందని ఆరోపించారు. 45 టీఎంసీలకు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని తమ ప్రభుత్వం కోరిందన్నారు. అన్ని అనుమతులు తీసుకుంటే కేంద్రం ప్రాజెక్ట్ కోసం నిధుల మంజూరు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

Also Read: Damodar Rajanarasimha: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో‌ 4 కొత్త హాస్పిటల్స్: మంత్రి దామోదర రాజనర్సింహ

Just In

01

Gali Janardhan Reddy: గాలి జనార్థన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి, 25 మందికి గాయాలు

Vanga NewYear: సందీప్ రెడ్డి కేక్ కటింగ్ స్టైల్ చూశారా.. కొత్త ఏడాదికి వెల్కమ్ పెద్దగా పలికాడు..

Harish Rao: ఏపీ జల దోపిడీకి కాంగ్రెస్ తలుపులు తెరిచింది: హరీష్ రావు ఫైర్..!

GHMC: ఫిబ్రవరి 10 తర్వాత.. జీహెచ్ఎంసీ మూడు ముక్కలు

Allu Arjun: స్టాఫ్‌తో న్యూయర్ వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్..