Bail to Lady Aghori (imagecredit:twitter)
తెలంగాణ

Bail to Lady Aghori: అఘోరీకి బెయిల్ మంజూరు చేసిన చెవెళ్ల కోర్టు..!

Bail to Lady Aghori: మహిళ ప్రొడ్యూసర్‌ను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన అఘోరీకి చేవేళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బేయిల్‌తో పాటుగా రూ.5 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అఘోరీపై మరో రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఈ రెండు కేసుల్లో అఘోరీ మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం.

గత కొన్ని నెలల క్రింద లేడీ అఘోరీ పేరు సోషల్ మీడియాతో పాటు మీడియాలో మారు మ్రోగింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో అఘెరీ వార్తలో నిలిచేది. కొన్ని రోజుల క్రితం వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లయిన ఈ జంటకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. 10 లక్షల రూపాయల మోసం కేసులో లేడీ అఘోరీని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. లేడీ అఘోరీతో పాటు వర్షిణిని కూడా అక్కడినుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

Also Read: KTR on MLAs: మనతో ఉండి వెన్నుపోటు పొడిచారు.. కేటీఆర్ సంచలన కామెంట్స్ !

అరెస్టు అనంతరం స్పందించిన లేడీ అఘోరీ అప్పట్లో సంచలన కామెంట్లు చేసింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నేను కోర్టుకు సహకరిస్తున్నానని, జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణితోనే ఉంటానని తేల్చి చెప్పింది. కొంతకాలంగా అఘోరీ, వర్షిణిల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ కూతురిని మాయమాటలతో లోబరుచుకుని, కేదార్నాథ్ తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వర్షిణి కుటుంబం ఆరోపించింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో కూడా కొన్నిరోజుల క్రితం నెట్టింట వైరల్ గా మారాయి. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ ఈ జంట ఓ సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసి హల్చల్ చేసింన విషయం మనకు తెలిసిందే.

కోర్టు నుంచి విడుదలైన అఘోరీ అలియాస్ శ్రీనివాస్. ఇప్పుడు ఎంచేస్తాడు. నిత్యం ఎదో ఓక అంశం మీద మాట్లాడి మల్లీ వివాదాలు సృష్టిస్తాడా, తన భార్య దగ్గరకు వెల్లి ఎవరికి కనపడకుడా దూరంగా వెల్లిపోతాడా, తనపై ఏవరైతే కేసుపెట్టి జైలుకు వెల్లేలా చేసారో వారికి ఏ సమాదానం చెప్తారో వేచి చూడాలి.

Also Read: Coronavirus In TG: కొవిడ్ సీజనల్ అలర్ట్.. ప్రజల ఆరోగ్యం కోసం ముందస్తు ప్లాన్‌!

 

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?