Medigadda Barrage (imagecredit:swetcha)
తెలంగాణ

Medigadda Barrage: కేసీఆర్‌ను గద్దెదింపడం కోసం ఈరెండు పార్టీలు కుట్ర?

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ వద్ద పేలుళ్లపై సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్(BRS) రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగడంపై ఆరోపణలు చేశారు. కేసీఆర్(KCR) ను గద్దెదింపడం కోసం కాంగ్రెస్(Congrees), బీజేపీ(BJP) కుట్రపన్నాయన్నారు. కేసీఆర్ పాలనలో 3లక్షల 50వేల కోట్లు అప్పు మాత్రమే తీసుకున్నారని పార్లమెంట్ లో చెప్పారన్నారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెద్దఎత్తున శబ్దాలు వచ్చాయని అక్టోబర్ 22న మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారన్నారు.

అసాంఘిక శక్తులు ఎవరో

మేడిగడ్డ బ్యారేజీ వద్ద శబ్దాల వెనుక అసాంఘిక శక్తులు ఉన్నారని ఫిర్యాదులో చెప్పారన్నారు. ఇప్పటి వరకు అసాంఘిక శక్తులు ఎవరో కనుక్కోలేదన్నారు. రేవంత్ రెడ్డి(Revannth Reddy) అబద్దాల్లో పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. 2022లోరికార్డు స్థాయిలో వరదలు వచ్చినా మేడిగడ్డ(Medigadda), అన్నారం(Annaram) సుందిళ్ళ బ్యారేజీలు తట్టుకున్నాయని, మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ రాయగానే ఎన్.డీ.ఎస్.ఏ(NDSA) వచ్చిందని, ఉత్తరాఖండ్(UK) లో మొత్తం డ్యామ్ కొట్టుకునిపోతే ఎందుకు ఎన్.డీ.ఎస్.ఏ అక్కడికు వెళ్ళలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద పేలుళ్ల శబ్దాలపై ఎన్.డీ.ఎస్.ఏ ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు.

Also Read: Bengali Web series: పెళ్లైన అమ్మాయితో ప్రేమలో పడ్డ హీరో.. ఇంతకూ ఏం జరిగిందంటే?

మొబైల్ ఫోన్స్ డేటా చెక్

అసాంఘిక శక్తులు రేవంత్ రెడ్డి(Revanth Reddy), బండి సంజయ్(Bandi Sanjaye), కిషన్ రెడ్డి(Kishan Reddy) ఇంకా ఎవరైనా అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి మొబైల్ ఫోన్స్ డేటా చెక్ చేస్తే వెంటనే దొరికేవాళ్లు అన్నారు. పిల్లర్లకు ఎక్కడా క్రాక్ రాదని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారని, మేడిగడ్డలో 20వ నంబర్ పిల్లర్ ను ఎవరో పేల్చే కుట్రచేశారని ఆరోపించారు. దీని వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారా లేదా అనేది సిట్ ఏర్పాటు చేసి తేల్చాలని డిమాండ్ చేశారు.

Also Read: RGV – Chiranjeevi: చిరంజీవితో సినిమా క్యాన్సిల్ అవడానికి కారణం ఎవరంటే..?

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?