BRS Party: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలను వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వాకౌట్ చేయడానికి గల కారణాలపై విస్తృత చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు వాకౌట్ చేశారు.. చేయాల్సిన అంత అవసరం ఏముంది.. విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేయాలి.. తమ తప్పు లేదని నిరూపించాలి.. సభ ద్వారా ప్రజలకు వివరించాలి. కానీ వాకౌట్ వెనక పెద్ద కుట్ర ఉందని ప్రచారం ఊపందుకుంది. మూసి ప్రక్షాళన పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడిన తర్వాత హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేశారు.. స్పీకర్ మైకు ఇవ్వలేదు.. ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వచ్చి బయటికి వెళ్ళిపోదాం పదా అని.. తీసుకొని వెళ్ళినట్లు పార్టీ ఎమ్మెల్యేల్లోనే చర్చ జరుగుతుంది. హరీష్ రావు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండానే పద పద అని తీసుకెళ్లారని.. దీని వెనక అసలు రహస్యం వేరే ఉందని ప్రచారం జరుగుతుంది.
వాకౌట్ చేయించారనే ప్రచారం
పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే.. జగదీష్ రెడ్డి(Jagadesh Reddy).. హరీష్ రావు(Harish Rao)ను సభలో ఉండకుండా తీసుకెళ్లారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ హరీష్ రావు సభలో మాట్లాడితే ఆయనకు క్రెడిట్ దక్కుతుందని.. అలా చేస్తే ఆయన కింగ్ మేకర్ అవుతారని.. ప్రజల్లో సైతం ఆయనకు మరింత ఇమేజ్ పెరుగుతుందని అది భావించి సభ నుంచి ఈ సెషన్ వాకౌట్ చేయించారనే ప్రచారం రూపొందుకుంది. మూసి పునర్జీవనం(Musi River rejuvenation) పైన.. అటు కృష్ణా నది జలాల పైన హరీష్ రావుకు మంచి పట్టు ఉంది. ఆయన వివరిస్తే ప్రజలకు సైతం అర్థమవుతుంది. అయితే ఈ వంశాన్ని గమనించిన పార్టీ అధిష్టానం హరీష్ రావుకు చెక్ పెట్టాలని సభ నుంచి వాకౌట్ చేయించాలను ప్రచారం జరుగుతుంది.
Also Read: Anasuya: రాశి గారి ఫలాలపై సారీ చెప్పిన అనసూయ.. పోస్ట్ వైరల్
డిప్యూటీ హోదాలో హరీష్ రావు
కేటీఆర్ కు ఈ నెల 2న ఫీవర్ వచ్చింది. ఆయన అసెంబ్లీకి రాలేదు. ఈ సమయంలోనే సభ నుంచి టిఆర్ఎస్(TRS) వాకౌట్ చేసింది. ఈ విషయం కేటీఆర్ సైతం తెలియదని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ లో డిప్యూటీ లీడర్ పదవి ఇచ్చిన కనీసం మాట్లాడే అవకాశం పూర్తి స్థాయిలో ఇవ్వలేదని.. ఆ పదవికి న్యాయం చేయకుండానే సభ వాకౌట్ జరిగిందని ప్రచారం రూపొందుకుంది. డిప్యూటీ హోదాలో హరీష్ రావు సభలో మరింత పేరు వస్తుందని.. పార్టీ క్యాడర్ లోను ఆయన ఇమేజ్ పెరుగుతుందని భావించిన పార్టీ అధిష్టానం చెక్ పెట్టడంలో భాగంగానే వాకౌట్ కు తెరదీశారని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది.
అసెంబ్లీ వేదికగా..
మరోవైపు పార్టీలోనూ ఈ వాక్ అవుట్ అంశం చర్చనీయాంశమైంది. కెసిఆర్ కు పార్టీలోని నాయకులు కేడర్లు మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వాలని విజ్ఞప్తులు సైతం వస్తున్నట్లు సమాచారం. అప్పుడు పార్టీ బలోపేతం అవుతుందని.. రాబోయే కాలంలో ఏ ఎన్నికల వచ్చినా విజయం సాధిస్తుందని పలువురు నేతలు బహిరంగనే పేర్కొంటున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ వేదికగా హరీష్ రావు ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తే ఆయనకు మరింత ఇమేజ్ పెరుగుతుందని అందుకే చెక్ పెట్టడంలో భాగంగానే జగదీశ్ రెడ్డి తో హరీష్ రావును సభ నుంచి బయటకు తీసుకొచ్చారని ప్రచారం జరుగుతుంది.

