BRS Party: గులాబీ బస్తి బాటకు సన్నద్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల కు సన్నాహాలు చేస్తుండడంతో బీఆర్ఎస్(BRS) పార్టీ సైతం సిద్ధమవుతుంది. అందుకు పార్టీ నేతలను సన్నద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. మెజార్టీ స్థానాలు సాధన లక్ష్యంగా ప్రణాళికల రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో 117 మున్సిపల్, ఆరు కార్పొరేషన్ ఉన్నాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా గులాబీ పార్టీ ప్రణాళికల రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్ష సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొన్న వరంగల్(Warangal).. నిన్న కరీంనగర్(Karima Nagar) నేతలతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. నేడు ఖమ్మం(Khammam), నిజాంబాద్(Nizamabad) జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. వరుసగా జిల్లాల వారిగా భేటీ అవుతూ వ్యూహాలను వివరిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని.. అర్బన్ ప్రాంతాల్లో పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని.. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరించాలని సూచిస్తున్నారు.
బస్తి బాట
బస్తి బాట పేరుతో అర్బన్ ప్రాంతాల ప్రజలకు దగ్గర అయ్యేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అనుసరిస్తున్న విధానం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, ఉద్యోగం నోటిఫికేషన్లు వేయడం లేదని.. నిరుద్యోగులకు అన్యాయం చేసిందని.. ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వడం లేదని తదితర అంశాలతో కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పంపిణీ చేయబోతున్నట్లు పార్టీలోని ఓ సీనియర్ నేత తెలిపారు. రెండేళ్లలో ప్రభుత్వ అనుసరించిన విధానం వైఫల్యాలను ప్రధానంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు తమకు కలిసి వస్తాయని.. మెజార్టీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు 4వేల పైచిలుకు గ్రామాల్లో విజయం సాధించారని.. ఇది ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత.. గులాబీ పార్టీ కి ప్రజల్లో ఉన్న సానుభూతి స్పష్టం అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రజలు పల్లెలో పట్టణాలకు అతీతంగా పార్టీ వైపు చూస్తున్నారని పూర్వ వైభవం తెచ్చేందుకు సైనికుల పని చేయాలని నేతలకు పార్టీ ఆదేశించింది.
Also Read: Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల వివాదం.. టీటీడీ ఛైర్మన్‌పై భూమన సంచలన ఆరోపణలు
మున్సిపాలిటీలో డివిజన్ల వారిగా ఇన్చార్యులు
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డివిజన్ల వారీగా పార్టీ ఇంచార్జిలను నియమించాలని ఆయా జిల్లా చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులకు అధిష్టానం సూచనలు చేసింది. ప్రతి డివిజన్ కు ఒక ఇన్చార్జిని నియమించి గెలుపు బాధ్యతలు అప్పగించాలని.. అదేవిధంగా యాక్టివ్ నేతలను గుర్తించి వారికి సైతం బాధ్యతలు అప్పగించాలని.. వారిపై పర్యవేక్షణ చేయాలని.. మళ్లీ పట్టు సాధించాలని.. పూర్వ వైభవం తీసుకురావాలని ఆ బాధ్యత మీదేనని ఉమ్మడి జిల్లా నేతల సమీక్ష సమావేశంలో తేల్చి చెబుతున్నారు. ఇది ఆయా నేతల పనితీరు స్పష్టం కానుంది. కవిత లేని లోటు పార్టీలో కనిపించోద్దని.. ఆమె ప్రభావం అసలు లేదని ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కేడర్ కు వివరించబోతున్నట్లు సమాచారం. ఆమె విమర్శలు చేసిన పట్టించుకోవద్దని.. పార్టీ నేతలు పార్టీపై దృష్టి సారించాలని మున్సిపల్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ సూచించినట్లు సమాచారం. ఎక్కడ కూడా కవిత పేరు ప్రస్తావించొద్దని.. ఆమె గురించి మాట్లాడితే మనమే ఆమెను హైలెట్ చేసినట్లు అవుతుందని అందుకే పట్టించుకోవద్దని.. ఆమె చేసే ఆరోపణలు విమర్శలకు సైతం కౌంటర్లు ఇవ్వకుండా.. పార్టీ పైన దృష్టి సారించాలని అధినేత సూచించినట్లు విశ్వాసనీయ సమాచారం. ఏదిఏమైనాప్పటికీ బి ఆర్ ఎస్ పార్టీ గత పూర్వవైభవాన్ని మున్సిపల్ ఎన్నికల్లో సర్వం సిద్ధం అవుతుంది. పార్టీ నేతలను ముందస్తుగానే అలర్ట్ చేస్తుంది.
Also Read: Jio IPO 2026: జియో ఐపీవో కోసం ఎదురుచూస్తున్నవారికి బిగ్ అప్‌డేట్

