BRS on Congress (imagecredit:twitter)
తెలంగాణ

BRS on Congress: title: ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు!

BRS on Congress: ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్న ఆయన ఏదో ఒక సందర్భంలో ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. అయితే, తన నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ నేతలు మౌనంగా ఉండటం ఆయనకు అస్సలు నచ్చడం లేదట. తాను చేసే విమర్శలపై కౌంటర్‌ ఇవ్వకుండా మౌనం ఉండటంపై ఆ ఎమ్మెల్యే నారాజ్‌ అవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఆ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు సంబంధించి ఇద్దరు కీలక నేతలు ఉండగా, మీరు స్పందించండి అంటే, మీరు స్పందించండంటూ తగువులాడుతున్నారని తెలుస్తున్నది. పొలిటికల్‌ వార్‌ అనేదే లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్‌లోనూ ఒకింత అసంతృప్తి నెలకొన్నది.

ఆ ఇద్దరి మధ్య సోషల్‌ వార్‌

ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఉండటం సహజం. కానీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాత్రం ప్రతిపక్షంలో మౌనం రాజ్యమేలుతున్నది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఒకరు అయితే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న యువనేత ఆ నియోజకవర్గంలో ఉన్నారు. అయితే, పాలక ప్రభుత్వ పాలనాపరమైన లోపాలను ఎత్తి చూపడంలోనూ ఆ ఇద్దరు నేతలు విఫలమవుతున్నారనే విమర్శలను మూటగట్టుకోగా, కనీసం అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపైననూ స్పందించడం లేదు.

ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలను సైతం ఖండించడం లేదు. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ తర్వాత స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌, హరీశ్ రావు, కవితలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయినా, బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ గానీ, మాజీ ఎమ్మెల్యే గానీ ఏమాత్రం స్పందించలేదు. ఇది ఇరు నేతల మధ్య సోషల్‌ వార్‌కు దారితీసింది.

Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో.. సీఎం అత్యవసర సమీక్ష!

మీరు స్పందించాలంటే, మీరే స్పందించాలంటూ.. ఆ నేతలకు సంబంధించిన క్యాడర్‌ సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. కింది స్థాయి నేతలు స్పందిస్తున్నప్పటికీ, మాజీ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా మీకు బాధ్యత లేదా? అంటూ కొందరు సొంత పార్టీ నేతలే నిలదీసిన సందర్భాలున్నాయి. ఇదిలా ఉంటే, అర్థం పర్థం లేకుండా విమర్శలు చేసి ప్రజల్లో పలుచన కానొద్దనే విమర్శలు చేయడం లేదని, సరైన సందర్భంలో ధీటుగా ప్రతి స్పందిస్తామని సదరు నేతలు క్యాడర్‌కు నచ్చజెప్పుతూ వస్తున్నట్లు సమాచారం.

అధికార పార్టీ ఎమ్మెల్యే నారాజ్‌

బీఆర్‌ఎస్ పార్టీ నేతల నుంచి ప్రతి స్పందన లేకపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే సైతం ఒకింత నారాజ్‌ అవుతున్నట్లు తెలుస్తున్నది. తన విమర్శలకు పెద్ద లీడర్లు స్పందించడం లేదని ముఖ్య అనుచరుల వద్ద ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. అయితే, బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్నది మౌనం కాదని, వ్యూహంలో భాగమేనని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా ఎలాంటి పొలిటికల్‌ వార్‌ లేని ఆ నియోజకవర్గ రాజకీయంపై స్థానికంగా చర్చ జోరుగా సాగుతున్నది.

Also Rerad: Allegations on GHMC: గులాబీ పాలన హయాంలో అక్రమ నియామకాలు.. కొత్త సర్కారుకు ఎదురైన సవాళ్లు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!