Sudarshan Reddy [ image credit facebook ]
తెలంగాణ

Sudarshan Reddy: ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖాయమేనా? ఇదే హాట్ టాపిక్ ఇక్కడ..

Sudarshan Reddy: జిల్లాకు కేటాయించే మంత్రి పదవి విషయంలో ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 16 నెలల అధికార కాంగ్రెస్ పాలనలో జిల్లాకు రావలసిన నిధులు అడిగే విషయం కానీ జరగాల్సిన అభివృద్ధిపై స్తబ్దత నెలకొంది.

దీంతో జిల్లాకు మంత్రి పదవి వరిస్తే ఉమ్మడి జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కాంగ్రెస్ పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల్లో పెద్ద చర్చనే మొదలైంది. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి మంత్రి పడవు కన్ఫామ్ కేటాయించాల్సిన శాఖలు మాత్రమే మిగిలి ఉన్నాయని జిల్లాలో ప్రచారం కొనసాగుతుంది.

 Also Read: Vanasthalipuram FCI Colony: నిధులు తెచ్చింది మేము.. శంఖుస్థాపన మీదా? కార్పొరేటర్ ఫైర్

జిల్లా అభివృద్ధికి నిదుల మంజూరు, కీలకమైన పాలనా అంశాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రతి ఉమ్మడి జిల్లాకు కేబినెట్ మంత్రి ఉంటేనే, పథకాల అమలు పక్కాగా ఉంటుందనేది ప్రతి ఒక్కరి లెక్క. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 16 నెలలు అవుతు న్నప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మం త్రి లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల తోపాటు అన్ని వర్గాల ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు.

జిల్లాలోని ఆయా గ్రామాలు, మండ లాలు, నియోజకవర్గాల్లో పనులతోపాటు ప్రజాస మస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు మంత్రి లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఆయా వర్గాలకు చెందిన వారు ఏదైనా అంశాన్నైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Rajiv Yuva Vikasam Scheme: నిరుద్యోగులూ.. అప్లై చేసుకున్నారా? కలెక్టర్ సమీక్ష

కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధినాయకత్వం పచ్చజెండా ఊపిందని, ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉన్నట్లు వార్తలు రావడంతో జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖాయమ ని తెలుస్తోంది. ఈ క్రమంలో సుదర్శన్ రెడ్డికి విద్య లేదా హోంశాఖ కేటాయిస్తారనే చర్చ జోరందుకుం ది. ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి వస్తే ఆ తరువాత తమకు నామినేటెడ్ పదవుల కేటాయింపునకు మార్గం సుగమమైనట్లేనని ఆశావహులు ఎదురు చూస్తున్నారు.

కాగా సుదర్శన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ కేటాయించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఆయన హామీ నేపథ్యంలోనే సుదర్శన్రెడ్డి ఉమ్మడి జిల్లాలో అనధికారిక మంత్రిగా అన్నీ తానై వ్యవహరిస్తున్నా రు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, ప్రమాణ స్వీకారం విషయమై అన్ని వర్గాల్లో ఉత్కంఠతో కూడిన ఎదురుచూపులు నెలకొన్నాయి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు