BJP Party: 2025లో చిత్తైన బీజేపీ.. ఎన్నికల్లో ఘోర తప్పిదాలు!
BJP Party (Image Source: twitter)
Telangana News

BJP Party: 2025లో చిత్తైన బీజేపీ.. ఎన్నికల్లో ఘోర తప్పిదాలు.. కొత్త ఏడాదైనా గాడిలో పడేనా?

BJP Party: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కమలం పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ఎన్నికల ఫలితాల్లో ఒడిదుడుకులు ఒక ఎత్తు అయితే, పార్టీని పీడిస్తున్న అంతర్గత విభేదాలు మరో ఎత్తు. ‘ఆదిలో హిట్.. చివర్లో ఫట్’ అనే చందంగా తయారైంది పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి మిరాకిల్ సృష్టించిన పార్టీ, ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికల నాటికి వరుస తప్పిదాలతో చతికిలపడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చినప్పటికీ, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపం, గ్రూపు రాజకీయాలు బీజేపీ ప్రతిష్టను దెబ్బ తీశాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంతో పోలిస్తే కొంత ఊరటనిచ్చే ఫలితాలు వచ్చినప్పటికీ, అంతర్గత పోరు మాత్రం క్యాడర్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్ సమయంలో జరిగిన వ్యూహాత్మక తప్పిదాలు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారాయి.

తర్వాత తగ్గిన జోష్

తెలంగాణ బీజేపీ నేతలు 2025లో ఆశల పల్లకిలో ఊరేగాలనుకున్నారు, కానీ సొంత కుంపటిలోనే మంటలు, ఎంపీల మధ్య ఆధిపత్య పోరు, ఎమ్మెల్యేల మధ్య అగాధంతో అయోమయంగా గడిపేశారు. గెలిచిన చోట గందరగోళం, ఓడిన చోట కన్నీళ్లు అన్నట్లుగా సాగింది. 2025 ప్రారంభంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీ రెండు స్థానాల్లో అనూహ్య విజయం సాధించింది. అధికార పార్టీ వ్యూహాలు, ప్రలోభాలు, డబ్బు బల ప్రయోగాలకు ఎదురొడ్డి మరీ ఆదిలాబాద్ – నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య కమలం జెండాను ఎగురవేశారు. ఈ గెలుపు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే ఆ జోష్‌ను పార్టీ నాయకత్వం, నేతలు కొనసాగించడంలో ఫెయిలయ్యారనే టాక్ ఉన్నది.

పీఎం క్లాస్ తీసుకున్నా మారని పరిస్థితి

ఈ ఎన్నికల్లో గెలుపు అనంతరం పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డి నుంచి రాంచందర్ రావు చేతికి వచ్చాయి. ఈ అంశంలో పాత నేతలు సానుకూలంగానే స్పందించినా రాజాసింగ్‌కు, ఇంకొందరకి ఏమాత్రం మింగుడు పడలేదు. అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల రోజే రాజాసింగ్ రాజీనామా చేశారు. దీంతో స్టేట్ చీఫ్​‌గా రాంచందర్ రావు ఇన్, ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న రాజాసింగ్ ఔట్ అన్నట్లుగా పరిస్థితి మారింది. పార్టీ రథసారథి మారినా కాషాయ రథం మాత్రం ముందుకు సాగలేదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు. దీనికి తోడు తెలంగాణ కమలదళంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మధ్య సయోధ్య లేకపోవడంతో 2025 ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వర్గానికి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్గానికి మధ్య అంతర్గత పోరు విపరీతంగా పెరిగిపోయింది. పరస్పర ఫిర్యాదులతో వివాదం మరింత రచ్చకెక్కింది. ఈ అంతర్యుద్ధంపై ఏకంగా ప్రధాని మోదీ ఎంపీలకు గట్టి క్లాస్ తీసుకున్నా పరిస్థితి మాత్రం మారలేదనే టాక్ వినిపిస్తోంది.

2026లో అయినా..

తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరాటాల ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్పష్టంగా కనిపించింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా ఆ ఎన్నికలో బీజేపీ ఓటమికి కూడా సవాలక్ష కారణాలు ఉన్నాయి. పార్టీ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, నేతలంతా సమన్వయంతో ప్రచారం చేయకపోవడంతో కమలదళం గతంలో వచ్చిన ఓట్లు కూడా సాధించకపోగా చివరకు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ పరిధిలో జరిగిన ఎన్నిక కావడంతో నింద ఆయనపై పడింది. ఇకపోతే సర్పంచ్ ఎన్నికల్లో గతంలో పోలిస్తే కమలదళం కాస్త నయమనే చెప్పుకోవాలి. కానీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే గ్రౌండ్ స్థాయిలో స్ట్రాంగ్ అవ్వాలనేంత స్థాయికి చేరుకోకపోవడం మైనస్‌గా మారింది. దీంతో ఏడాది చివరలో సర్పంచ్ ఎన్నికలు కమలం పార్టీకి కాస్త ఊరటనిచ్చాయి.

Also Read: Shivaji Statue: రాయపర్తిలో కలకలం.. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

2026లో రాణించాలంటే..

ప్రస్తుతం 2025 ముగుస్తున్న తరుణంలో, అందరి దృష్టి 2026 పైనే ఉంది. 2025లో బీజేపీ అనుకున్నంత స్థాయిలో ఆశించిన ఫలితాలు రాలేదు. 2026లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలంటే వచ్చే గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి, నేతలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్తే తప్ప సాధ్యం కాదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా పార్టీలోని లీక్ వీరుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, క్రమశిక్షణను గాడిలో పెట్టకపోతే 2026లో కూడా పాత తప్పిదాలే పునరావృతమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా బీజేపీ నేతలు తమ తప్పులను సరిదిద్దుకుని 2026లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తారా లేదా అనేది చూడాలి.

Also Read: Shiva Lingam Vandalized: శివలింగం ధ్వంసం కేసులో కీలక పరిణామం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Just In

01

Bank Holidays 2026: 2026లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? ఆర్‌బీఐ ప్రకటించిన పూర్తి క్యాలెండర్

Wolf Supermoon: కొత్త ఏడాదిలో బిగ్ సర్‌ప్రైజ్.. ఆకాశంలో తోడేలు చందమామ.. ఇప్పుడు మిస్సయితే..

Dhurandhar Movie: అలా జరిగినందుకు రూ.90 కోట్ల వరకూ నష్టపోయిన ‘దురంధర్’ సినిమా.. ఎందుకంటే?

Anaganaga Oka Raju: సంక్రాంతికి ఉన్న భారీ పోటీపై నవీన్ పొలిశెట్టి ఏమన్నారంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ క్లైమాక్స్ గురించి మారుతీ చెప్పింది ఇదే.. అది 70 రోజుల కష్టం..