Shiva Lingam Vandalized: కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గల పురాతన శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు సైతం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిందితుల కోసం పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శివలింగం ధ్వంసానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంతో కీలకమైన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి విచారించగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.
సీసీటీవీ దృశ్యాలు..
దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి 1.25 గంటల ప్రాంతంలో కపాలేశ్వర స్వామి ఆలయం వద్దకు నిందితుడు వచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. స్కూటీని సమీపంలో పార్క్ చేసిన అతడు.. చేతికి ఓ బ్యాగ్ తగిలించుకొని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లుగా సీసీటీవీ దృశ్యాలు తెలియజేస్తున్నాయి. ఆలయం పరిసరాల్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించి.. కపాలేశ్వర స్వామి శివలింగాన్ని అతడు ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుడ్ని ద్రాక్షారామం మండలం తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడ్ని అదుపులోకి తీసుకొని.. విగ్రహం ధ్వంసానికి గల కారణాలను విచారిస్తున్నారు.
ద్రాక్షారామంలోని పురాతన శివలింగం ధ్వంసం కేసులో ప్రధాన అనుమానితుడిని గుర్తించిన పోలీసులు
అర్థరాత్రి 1.25 గంటలకు సప్త గోదావరి నది ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చిన దుండగుడు
స్కూటీని పార్క్ చేసి ఓ బ్యాగ్ తో లోపలికి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో… https://t.co/oDEI4ekeRm pic.twitter.com/bpC7TDYyCo
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2025
చంద్రబాబు కీలక ఆదేశాలు..
శివలింగం ధ్వంసం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దాడికి సంబంధించిన వివరాలను దేవదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు మంత్రి తనకు తెలియజేశారని సీఎం అన్నారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిని త్వరితగతిన గుర్తింతి.. కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ధ్వంసమైన శివలింగం స్థానంలో నూతన శివలింగం పునః ప్రతిష్ట చేసినట్లు మంత్రి ఆనం నారాయణరెడ్డి సీఎంకు తెలిపారు.
Also Read: Anvesh Controversy: యూట్యూబర్ నా అణ్వేషణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి.. ఎందుకంటే?
శివలింగం ధ్వంసం అందుకేనా?
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి.. 38 ఏళ్ల శీలం శ్రీనివాస్ అని తెలుస్తోంది. అంతేకాదు దాడికి పాల్పిడింది తానేనని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. భీమేశ్వర ఆలయంలో పూజలు చేసే విషయంలో పూజారితో శ్రీనివాస్ కు వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ విషయమై పూజారీతో పలుమార్లు శ్రీనివాస్ గొడవ కూడా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పూజారిపై ఏర్పడ్డ కోపాన్ని.. శివలింగం ధ్వంసం ద్వారా తీర్చుకొని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రముఖ శైవక్షేత్రాలుగా పిలువబడే పంచరామాల్లో ఒకటిగా ద్రాక్షారామంను చెబుతారు. జ్యోర్లింగాలలో ఆఖరి లింగం ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. అలాంటి ఈ ఆలయం పరిసరాల్లోని కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేయడంపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ద్రాక్షారామంలో పురాతన శివలింగం ధ్వంసం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న అతి పురాతన శివలింగాన్ని.. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ధ్వంసం చేసిన దుండగులు
సప్త గోదావరి తీరంలో శివలింగం అవశేషాల్ని విసిరి వేయడంతో భక్తులు ఆగ్రహం
స్వయం ప్రకటిత సనాతని… pic.twitter.com/5aaES0ubZp
— YSR Congress Party (@YSRCParty) December 30, 2025

