BJP Telangana: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో మున్సిపలిటీల విలీనంపై బీజేపీ(BJP) నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన డివిజన్ విభజన ప్రక్రియలో అనేక అవకతవకలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన నిర్ణయాలు చోటు చేసుకున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత డివిజన్ విభజన ప్రజల అభిప్రాయాలు, స్థానిక వాస్తవాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టారని పేర్కొన్నారు. ఈ విభజన వల్ల ప్రజలకు పరిపాలనా ఇబ్బందులు, అభివృద్ధి అసమానతలు, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
రాజ్యాంగ విరుద్ధం
అలాగే, సంబంధిత నిబంధనలు, చట్టపరమైన విధానాలను పూర్తిగా పాటించకుండా డివిజన్ విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణమే స్టే విధించాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు(High Cort)ను కోరారు. ఈ పిటిషన్ దాఖలు చేసినవారిలో బీజేపీ నేతలు నారగూడెం మల్లారెడ్డి(Mallreddy), సోల్కర్ రెడ్డి(Solkar Reddy), మల్లేష్ యాదవ్(Mallesh Yadav), విజయ్ కుమార్(Vijay Kumar), దేవర శ్రీనివాస్(Sinivas), మధుకర్ రెడ్డి, గొరిగె రాజు, వెంకటేష్, అడ్వకేట్లు ఆంటోనీ రెడ్డి, అవినీష్ రావు ఉన్నారు.
Also Read: Hydraa: గుడ్ న్యూస్.. బతుకమ్మకుంటలో ఆపద మిత్రుల బోటు రిహార్సల్స్!

