Telangana : తెలంగాణ బీజేపీలో కొత్త చర్చ మొదలైంది. లీడర్ అవ్వాంటే ఉండాల్సిన అర్హతపై డిస్కషన్ షురూ అయింది. ఎందుకంటే, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జీ అభయ్ పాటిల్ కామెంట్స్ ఈ చర్చకు దారితీశాయి. కేసులుంటేనే లీడర్ అని, లేకుంటే వేస్ట్ అని ఆయన నేతలతో ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పడంతో అవాక్కవ్వడం వారి వంతయింది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన ఆఫీసర్ బేరర్స్, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేయడంలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది. కాగా, అభయ్ పాటిల్ ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షులను ఓ వింతైన ప్రశ్న అడిగినట్లు తెలిసింది. ఆ ప్రశ్నతో నేతలంతా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
Also Read: Rama Naidu Studios: వివాదాస్పదంగా రామానాయుడు స్టూడియో భూమి.. స్వాధీనానికి రంగం సిద్దమైనట్టేనా?
బీజేపీ ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షులనుద్దేశించి ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయంటూ అభయ్ పాటిల్ ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో, పలువురు కేసులున్న నేతలు నిలబడినట్లు సమాచారం. ఆపై అసలు కేసులు లేని వారు ఎంతమందని ప్రశ్నించగా ఇంకొందరు నిలుచున్నట్లు తెలిసింది. దీంతో అభయ్ పాటిల్ అసలుకేసులు లేకుండా ఉంటే నాయకుడెలా అవుతారంటూ నేతలకు చురకలంటించినట్లు తెలిసింది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు చేసి జైలు, కేసులు ఉంటేనే నాయకుడవుతారంటూ పాటిల్ చేసిన కామెంట్స్ తో అందరూ షాకయినట్లు తెలిసింది.
Also Read: TG Officials Japan Visit: త్వరలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు.. జపాన్ కు సీఎం అందుకోస మేనా?
పెడతారని వెనక్కి తగ్గొద్దని జిల్లా అధ్యక్షులకు, ఆఫీస్ బేరర్లకు బన్సల్ దిశానిర్దేశం చేసినట్లు టాక్. నాయకుడంటే కేసులు లేకుంటే వేస్ట్.. అంటూ అభయ్ పాటిల్ కామెంట్స్ పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. నిజమే కదా.. లీడర్ అంటే ప్రజల కోసం ఫైట్ చేసి కేసులను లెక్క చేయొద్దంటూ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇంకొందరు నేతలు ఈ అంశంపై సెటైర్లు వేశారు. కేసులంటే.. అవినీతి కేసులు కాదని, అన్యాయంపై పోరాడిన కేసులు ఉండాలంటూ ఇతర పార్టీలనుద్దేశించి కామెంట్స్ చేయడం గమనార్హం. అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలతో అయినా బీజేపీ నేతలు ప్రజా క్షేత్రంలో సీరియస్ గా ఫైట్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.