తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: TG Officials Japan Visit: రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలిసారి ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటించనున్నది. జపాన్‌లోని ఒకాసా నగరంలో ఈ నెల 16 నుంచి 21 తేదీల మధ్య జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పో ఈవెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పాల్గొంటున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ స్థాయిలో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైమ్. ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ అధికారులు కూడా జపాన్ పర్యటనలో పాల్గొంటున్నారు.
తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఈ ఎక్స్ పో లో పాల్గొంటున్నందున భారతదేశానికి మొత్తానికి కలిపి ఒకే పెవిలియన్ ఏర్పాటవుతున్నది. అందులో తెలంగాణకు ఒక స్టాల్‌ను నిర్వాహకులు కేటాయించారు. ఈ పెవిలియన్‌ను ప్రధాని మోడీ సందర్శించనున్నందున తెలంగాణ స్టాల్‌ను విజిట్ చేసేలా ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నందున ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
Also Read: SBI PO prelims result 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫలితాలు విడుదల.. చెక్ చేసుకున్నారా?
రాష్ట్రానికి కేటాయించిన స్టాల్ వేదికగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా వివిధ దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలను, ఇన్వెస్టర్లను కోరుతామని, రెండు రోజుల పాటు స్టాల్ వేదికను వాడుకుంటామని, ఆ తర్వాత మొత్తం దేశానికి ఇచ్చిన పెవిలియన్ వేదికగా చర్చలు జరుగుతాయని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. మొత్తం పెవిలియన్‌ను రాష్ట్రాలవారీగా వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం షెడ్యూలు ఫిక్స్ చేస్తుందని, దానికి తగినట్లుగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటామన్నారు.
భారత్ పెవిలియన్ వేదికగానే ప్రధాని ప్రసంగించనున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూ వివాదం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున దీని గురించి మాట్లాడదల్చుకోలేదని స్పష్టం చేశారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/