TG Heavy Rains( Image Source: Twitter)
తెలంగాణ

TG Heavy Rains: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షం

TG Heavy Rains: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మొదలయ్యాయి. అయితే, ఈ సారి వాతావరణ పరిస్థితులు వింతగా మారాయి. చలి కాలంలో సూర్యుడు భగ భగ మండాడు. ఇక, ఇప్పుడు వానలు పడుతూ రోజుకొక లాగా ఉంటుంది. ఓ వైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఏ పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో వైపు సాయంత్ర సమయంలో వర్షాలు పడుతూ రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.

తాజాగా, తెలంగాణకు ( Telangana)  మరో సారి వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మరో మూడు రోజులు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే, కొన్ని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ పేర్కొంది.

Also Read: Sri Varshini on Aghori: ఉప్పెన మూవీని తలపిస్తున్న అఘోరీ ప్రేమ కథ.. అదేం పెద్ద సమస్య కాదట!

దక్షిణ భారతదేశంలో విస్తారమైన మేఘాలు కేంద్రీకృతమయ్యాయి. ఈ మేఘాలు కదులుతూ తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్నాయి. ఇంకో వైపు ఆగ్నేయ ఆసియా ప్రాంతం నుంచి కూడా మేఘాలు రావడం వలన తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

రోజూ నాగర్ కర్నూల్, వనపర్తి, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు పడతాయని, గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Also Read: Sodaraa: సంపూ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చిన నిర్మాత.. మ్యాటర్ ఏంటంటే?

ఇక, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఒక రోజు ఎండ ఎక్కువగా ఉంటే, ఇంకో రోజు జోరున వానలు పడుతున్నాయి. దీంతో, నగరంలోని రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, హైద్రాబాద్ లో కూడా ఉరుములతో కూడిన వానలు పడతాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!