Sri Varshini on Aghori: లేడీ అఘోరి (Lady Aghori) వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. శ్రీవర్షిణి (Sri Varshini) అనే బీటెక్ చదివిన యువతిని అఘోరి మాయమాటలు చెప్పి తన వశం చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమ కూతుర్ని అఘోరి కిడ్నాప్ చేసిందంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడం ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవల గుజరాత్ వెళ్లిన అఘోరీ నుంచి శ్రీవర్షిణీని తీసుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియా ఛానెల్ డిబేట్ పాల్గొన్న శ్రీవర్షిణి సంచలన వ్యాఖ్యలు చేసింది.
నాకు అఘోరీకి పెళ్లైంది: వర్షిణి
అఘోరీతో ప్రేమాయణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన యువతి శ్రీవర్షిణి.. సంచలన విషయాలు వెల్లడించింది. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తనకు అఘోరీకి పెళ్లి జరిగినట్లు ఆమె తెలిపింది. అఘోరీ తనకు తాళి కట్టిందని పేర్కొంది. ఇష్టమైన వ్యక్తులతో ఉండే హక్కు తనకు ఉందని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి అంటే కేవలం శృంగారం కాదన్న శ్రీవర్షిణి.. అఘోరీ వ్యక్తిత్వం తనకు నచ్చినట్లు వివరించింది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
అఘోరీ లేకుంటే చనిపోతా!
అఘోరీతో రిలేషన్ అసహజమైనదన్న ప్రశ్నకు శ్రీవర్షిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. అఘోరీ నుంచి దూరం చేస్తే తట్టుకోలేనని ఆమె అన్నారు. ఈ ఎడబాటును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. అఘోరీపై తన ప్రేమ ఎప్పటికీ తగ్గదన్న శ్రీవర్షిణి.. 5 కాదు 10 ఏళ్లు అయినా తన లవ్ చెక్కుచెదరదని ఆమె స్పష్టం చేసింది.
నార్త్ లో కాపురం
మరోవైపు ఇదే డిబెట్ లో పాల్గొన్న అఘోరీకి యాంకర్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరే నిత్యం కారులో తిరుగుతుంటారు.. మీ వెంటే యువతిని కూడా తిప్పుతూ ఉంటారా? అని ప్రశ్నించారు. దీనికి అఘోరీ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తాను నార్త్ లో ఓ స్థలం చూస్తున్నట్లు చెప్పింది. అక్కడే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీవర్షిణితో కలిసి జీవిస్తానని లేడీ అఘోరీ పేర్కొంది. శ్రీవర్షిణి ఇక నుంచి తన భార్య అన్న అఘోరీ.. తన నుంచి ఆ యువతిని ఎవరూ దూరం చేయలేరని తేల్చి చెప్పింది.
వర్షిణీని లాక్కెళ్లిన ఫ్యామిలీ
ఇటీవల గుజరాత్ సౌరాష్ట్రలోని పెట్రోల్ బంక్ లో లేడీ అఘోరి, శ్రీ వర్షిణి నిద్రిస్తుండగా పోలీసులు సాయంతో యువతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. యువతిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. తాను అఘోరీని వదిలి రానని కన్నీళ్లు పెట్టుకొని ప్రాధేయపడినా కుటుంబ సభ్యులు వినలేదు. వర్షిణి ఫ్యామిలీకి చెందిన విష్ణు, శ్రీ హర్ష, భవాని ఆమెను తమతో పాటు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా అవి క్షణాల్లో వైరల్ గా మారాయి.
Also Read: Saleshwaram: ఈ గుడితో అంత ఈజీగా కాదు.. ప్రతీ అడుగు సాహసమే.. ఏడాదిలో 3 రోజులే ఛాన్స్!
వారిద్దరి పరిచయం ఎలా అంటే?
వర్షిణి కుటుంబ సభ్యుడు శ్రీవిష్ణు ద్వారా ఆమెకు అఘోరీతో పరిచయం అయ్యింది. ఓ రోజు విజయవాడలోని జనసేన పార్టీ ఆఫీసు వద్ద అఘోరి కారు ఆగిపోగా.. విష్ణు అఘోరిని చూసి తన ఇంటికి రావాలని సూచించారు. అఘోరి ఆ ఇంట్లో దాదాపు రెండు వారాలు ఉండగా.. ఈ క్రమంలో శ్రీవర్షిణి ఆమె మాయలో పడిపోయింది. ఓ రోజు మార్నింగ్ ఇద్దరూ చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో శ్రీ వర్షిణి కుటుంబ సభ్యులు ఆమెపై కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.